Janhvi Kapoor: అమ్మ అందరిని వెంటాడే ఎమోషన్. ఆమె లేనిదే సృష్టే లేదు. అమ్మ లేనిదే ప్రతి బిడ్డకు జీవితమే లేదు. ఆమె లేకపోయినా.. ఆమె జ్ఞాపకాలతోనే బిడ్డలు బతుకుతూ ఉంటారు. తాను కూడా అలాగే బతుకుతున్నాను అంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కూతురును హీరోయిన్ గా చేయడానికి శ్రీదేవి ఎంతో కష్టపడింది. చివరకు కూతురును వెండితెరపై చూడకుండానే కన్నుమూసింది. ఇక ఎదిగిన వయస్సులో తల్లి పక్కన లేకపోతే ఆ పిల్లలు ఎలా ఉంటారో అందరికి తెల్సిందే. కానీ, జాన్వీ మాత్రం తన తల్లి స్థానాన్ని తీసుకుంది. చెల్లి ఖుషీకి తల్లిగా మారింది. ఏదికావాలన్నా ఆమె ధైర్యంగా నిలబడి చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా జాన్వీ, తల్లి గురించి చెప్పడం మాత్రం మర్చిపోదు. తల్లితో తాను పంచుకున్న మధురమైన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి చెప్తూ జాన్వీ ఎమోషనల్ అయ్యింది. “అమ్మ.. ఎప్పుడు నన్ను నా కొడకా అని అంటూ ఉండేది. నేను ప్రతిసారి.. అమ్మ రూమ్ లోకి వెళ్లి లిప్ స్టిక్స్ తీసుకొని నా జేబులో పెట్టుకొని వచ్చేస్తా.. బయటకు రాగానే.. నా జేబులు చూపించమని అడిగేది. నేను.. నో మమ్మా అని పరిగెట్టేదాన్ని.. తను.. నా కొడకా అంటూ వచ్చేది” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తల్లీకూతుళ్ల మధ్య ఆ ప్రేమను ఎవరు పోగొట్టలేరు. శ్రీదేవి ని మిస్ అవుతున్నాం అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ.. దేవర సినిమాలో నటిస్తోంది.