Jailer vs Jailer Movies releasing on august 10th: కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ విడుదలకు సిద్దం అవుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ‘జైలర్’ మూవీ ఆగస్టు 10న మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ కానున్న క్రమంలో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది. ఇక ఇదే సమయంలో తమిళ, తెలుగు సహా కేరళలోనూ ‘జైలర్’ పేరుతోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఇదంతా ఒక ఎత్తయితే ఈ టైటిల్‌పై కేరళలో మాత్రం అభ్యంతరం ఎదురైంది. ఎందుకంటే ఇదే పేరుతో మలయాళంలో మరొక చిత్రం తెరకెక్కింది.మలయాళ దర్శకుడు సక్కీర్ మడతిల్ ధ్యాన్ శ్రీనివాసన్ లీడ్ రోల్‌లో ‘జైలర్’ పేరుతోనే పీరియాడికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించగా రజినీ నటించిన సినిమా సైతం ఇదే పేరుతో రిలీజ్ కానుంది.
Sakshi Dhoni: నేను అల్లు అర్జున్ ఫ్యాన్..ఒక్క సినిమా కూడా వదల్లేదంటున్న ధోనీ భార్య
ఈ రెండు చిత్రాల కథల విషయంలో ఎలాంటి పోలిక లేనప్పటికీ.. ఒకే టైటిల్ కామన్ ఆడియన్స్‌ను కన్‌ప్యూజ్ చేస్తుందనే వాదన మలయాళ మేకర్స్ తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే తమది చిన్న సినిమా అని టైటిల్ మారిస్తే అది సినిమాపై ప్రభావం చూపుతుందని వారు వారు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరూ వెనక్కి తగ్గక పోవడంతో అదే పేరుతో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో తమన్నాతో పాటు ప్రియాంక మోహన్, జాకీ ష్రాఫ్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, యోగి బాబు, రమ్యకృష్ణ, వసంత్ రవి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్ మ్యూజిక్ అందించగా ఇప్పటికే విడుదలైన ‘కావాలయ్యా’ సాంగ్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.