నేడు ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన రజనీకాంత్ జైలర్ మూవీ పాన్ ఇండియన్ లెవల్‌లో పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నది. ఈ సినిమాలో పాత రజనీకాంత్ కనిపించాడని తలైవా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు.ఈ సినిమా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సన్ నెక్స్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ దక్కించుకుంది.ఈ సినిమా ను సన్ పిక్చర్స్ సంస్థ భారీగా నిర్మించడం తో తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ ద్వారానే ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సన్ నెక్స్ట్‌తో పాటు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో కూడా జైలర్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు కోసం నెట్‌ఫ్లిక్స్ తెగ ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమాను ఒకే సారి రెండు ఓటీటీ సంస్థల లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. అలాగే ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను కూడా జెమిని టీవీ సొంతం చేసుకుంది.థియేటర్లలో విడుదల అయిన ఆరు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో కి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.సెప్టెంబర్ చివరి వారం లో జైలర్ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తుంది .. జైలర్ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.జైలర్ సినిమా లో రజనీకాంత్ తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. అలాగే సినిమా లో యాక్షన్ సీన్స్ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమా లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాఫ్ తో పాటు రమ్యకృష్ణ,తమన్నావంటి స్టార్ క్యాస్ట్ ముఖ్య పాత్ర పోషించారు ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించారు.