Jailer: స్టార్లయందు సూపర్ స్టార్ వేరయా..ఇది ఒక్క కోలీవుడ్ మాట మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం వినిపించే మాట. రజినీకాంత్ ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. ఇప్పుడిప్పుడు పాన్ ఇండియా స్టార్లు అని చెప్పుకొస్తున్నారు. మొదటి నుంచి తలైవా పాన్ ఇండియా రేంజ్. ప్రపంచం మొత్తని తన సినిమాలతో ఏలిన రోజులు ఉన్నాయి. నేడు తలైవా 74 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఇక ప్రస్తుతం రజినీ నటిస్తున్న సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇక నేడు తలైవా పుట్టినరోజు కావడంతో రజినీ ఫస్ట్ లుక్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
అనిరుధ్ మ్యూజిక్.. నెల్సన్ ఎలివేషన్ తో రజినీ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. కాళ్ల దగ్గరనుంచి మొదలు కొని కళ్లు వరకు ఎలివేషన్ షాట్స్ కు నెల్సన్ టేకింగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. నీట్ గా తల దువ్వుకొని, సెంట్ కొట్టుకొని.. చివర్లో కత్తి పట్టుకొని జైలర్ ముత్తువేల్ పాండియన్ యుద్దానికి సిద్దమయ్యాడు. జైలర్ లుక్ మాత్రం పీక్స్ లో ఉంది.. కూల్ జైలర్.. కూల్ గా కిల్లర్స్ ను వేటాడడానికి బయలుదేరినట్లు కనిపిస్తోంది. టీజర్ మొత్తానికి హైలైట్ అనిరుధ్ మ్యూజిక్.. చితకొట్టేశాడు అనేది చిన్నమాట.. శాంపిల్ లుక్ కే ఇలా ఉంటే సినిమాకు అనిరుధ్ ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చి ఉంటాడో ఊహించుకోవచ్చు. మొత్తానికి ఫస్ట్ లుక్ తోనే నెల్సన్ మంచి మార్కులు కొట్టేశాడు. మరి సినిమాతో ఏ రేంజ్ విజయాన్ని అందుకోనున్నాడో చూడాలి.