హీరో కృష్ణ చేతుల మీదుగా ‘జై విఠలాచార్య’ బుక్ ఫస్ట్ లుక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే వెంటనే గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న చరిత్ర ఆయన సొంతం. టాప్ స్టార్స్ నుంచి న్యూ స్టార్స్ వరకూ ఆయన చేసిన సినిమాలన్నీ విఠలాచార్య చిత్రాలుగానే గుర్తింపు పొందాయి. ఆయనపై సగటు సినీ ప్రేక్షకుడికి ఉన్న గౌరవం అది. దశాబ్దాలుగా సినీ ప్రేమికులు ఆదరిస్తూ వచ్చిన విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన మూవీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేస్తున్నాడు సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ. ఆ పుస్తకానికి ‘జై విఠలాచార్య’ అని పేరు పెట్టారు. ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు.
ఈ పుస్తకం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు హీరో కృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘విఠలాచార్య దర్శకత్వంలో నేను ఒకే ఒక్క సినిమా చేశాను. అది ‘ఇద్దరు మొనగాళ్లు’. ఆ సినిమా హిట్ అయ్యింది. విఠలాచార్య గారు గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసేవారు. అనుకున్న బడ్జెట్లో తీసేవారు. అలాంటి విఠలాచార్యగారిపై పుస్తకం తీసుకు రావటం సంతోషంగా ఉంది’ అని అన్నారు.
Also Read
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
రచయిత పులగం చిన్నారాయణ మాట్లాడుతూ ‘జానపద బహ్మ విఠలాచార్య సినీ ప్రయాణానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రాసిన పుస్తకం ‘జై విఠలాచార్య’. విఠలాచార్యగారు గొప్ప దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప నిర్మాత కూడా. తక్కువ బడ్జెట్, తక్కువ లొకేషన్లలో వేగంగా, పొదుపుగా సినిమాను ఎలా తీయవచ్చనేది ఆయన ఆచరించి చూపించారు. సినిమా నిర్మాణంలో ఆయన పెద్ద బాలశిక్ష లాంటివారు. కరోనా సమయంలో విఠలాచార్యగారి శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేశాం. విఠలాచార్యగారు సినిమాను ఎంత వేగంగా తీసేవారో, అంతే వేగంగా ఈ పుస్తకాన్ని పూర్తి చేశాం. రచయితగా నా తొమ్మిదవ పుస్తకమిది’ అని అన్నారు. మూవీ వాల్యూమ్ షేక్ జిలాన్ బాషా మాట్లాడుతూ ‘పదమూడేళ్లుగా సినిమా జర్నలిస్టుగా ఉన్నాను. మూవీ వాల్యూమ్ పేరుతో వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాను. పబ్లిషింగ్ రంగంలో ప్రవేశించాను. చిన్నారాయణ రాసిన తొమ్మిదో పుస్తకం ‘జై విఠలాచార్య’ను మా తొలి పుస్తకంగా పబ్లిష్ చేయడం ఆనందంగా ఉంది. కృష్ణగారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా బుక్ ఫస్ట్‌లుక్ విడుదల చేయడం ముదావహం. సాధారణంగా సినిమాలకు ఫస్ట్‌లుక్ విడుదల చేస్తుంటారు. ఓ బుక్ ఫస్ట్‌లుక్ విడుదల చేయడం ఇదే తొలిసారి. డిసెంబర్ లో ‘జై విఠలాచార్య’ను అందుబాటులోకి తీసుకొస్తా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు కూడా పాల్గొన్నారు
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!