తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే వెంటనే గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న చరిత్ర ఆయన సొంతం. టాప్ స్టార్స్ నుంచి న్యూ స్టార్స్ వరకూ ఆయన చేసిన సినిమాలన్నీ విఠలాచార్య చిత్రాలుగానే గుర్తింపు పొందాయి. ఆయనపై సగటు సినీ ప్రేక్షకుడికి ఉన్న గౌరవం అది. దశాబ్దాలుగా సినీ ప్రేమికులు ఆదరిస్తూ వచ్చిన విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన మూవీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేస్తున్నాడు సీనియర్ జర్నలిస్ట్,…