ఒకే ఒక్క సాంగ్ ఆదిపురుష్ లెక్కలన్నీ మార్చేసింది. జై శ్రీరామ్ అంటూ పరవశంలో తేలుతున్నారు అభిమానులు. ఎక్కడ చూసినా ఆదిపురుష్‌లోని జై శ్రీరామ్ సాంగ్ మాత్రమే వినిపిస్తోంది. టీజర్ దెబ్బకు ఆదిపురుష్ పనైపోయిందని అనుకున్న వారంతా ఇప్పుడు ఆదిపురుష్‌కు ఎదురే లేదని మాట్లాడుకుంటున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ ఆదిపురుష్ పై అంచనాలను మరింతగా పెంచగా.. రీసెంట్‌గా రిలీజ్ అయిన జై శ్రీరామ్ సాంగ్ యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 24గంటల్లో 70 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క బాలీవుడ్‌లోనే 52 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి సెన్సేషన్‌గా నిలిచింది. ఫాస్టెస్ట్ 100కే లైక్స్, 10 నిమిషాల్లోనే మిలియన్‌కు వ్యూస్‌ను దక్కించుకుంది ట్రైలర్. ఇక ఇప్పుడు జై శ్రీరామ్ సాంగ్ కూడా.. 24 గంటల్లో వరల్డ్ వైడ్‌గా ఎక్కువ మంది చూసిన సాంగ్‌గా నిలిచింది.
“జై శ్రీరామ్” పాటకి అన్ని భాషల్లో కలిపి 45 మిలియన్స్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. 895 కె లైక్స్, 43కె కామెంట్స్‌తో.. 24 గంటల్లో 45 మిలియన్స్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది జై శ్రీరామ్ సాంగ్. ఇక జూన్ 16న థియేటర్లోకి వస్తున్న ఆదిపురుష్‌కు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామీ రాబోతోందని హెచ్చరిస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇప్పటి వరకు ఆదిపురుష్‌కు వచ్చిన హైప్ చూస్తుంటే డే వన్ కనీవినీ ఎరుగని ఓపెనింగ్స్ రాబడుతుందని అంటున్నారు. ఖచ్చితంగా ఆదిపురుష్ వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని అంటున్నారు. పైగా ఈ సినిమాకు పోటీగా మరే సినిమా కూడా రిలీజ్ కావడం లేదు. చిన్నా చితకా సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఆదిపురుష్‌కి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోతుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మరి ఆదిపురుష్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.