Jagapatibabu : ఆయన ఒ స్టార్ యాక్టర్. ఒకప్పుడు స్టార్ హీరో కూడా. క్షణం తీరిక లేకుండా సినిమాల్లో బిజీగా ఉంటారు. అలాంటి ఆయన సడెన్ గా మేకప్ ఆర్టిస్టుగా మారిపోయాడు. చేతిలో మేకప్ కిట్టు పట్టుకుని ఓ నటికి టచ్ అప్ చేసేశాడు. ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆయనకు ఏమైంది ఇలా మారిపోయాడని అనుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు జగపతి బాబు అలియాస్ జగ్గూ భాయ్. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదే సినిమాలో అలనాటి హీరోయిన్ ఆమని కూడా చేస్తున్నారు.
Read Also : PVR Inox IPL: గుడ్‌న్యూస్.. పీవీఆర్ ఐనాక్స్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం..
అయితే తాజాగా సెట్స్ లో ఆమనికి మేకప్ ఆర్టిస్టుగా మారిపోయి టచ్ అప్ చేశారు జగపతి బాబు. చేతిలో గొడుగు పట్టుకుని నిలబడి టచ్ అప్ చేస్తున్నారు. ఆమని కుర్చీలో కూర్చుని మేకప్ వేయించుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘నా భార్య నన్ను కోటి రూపాయలకు అమ్మక ముందు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. వీరిద్దరూ గతంలో శుభలగ్నం సినిమాలో నటించారు. ఆ మూవీలో తన భర్త జగపతిబాబును ఆమని కోటి రూపాయలకు అమ్మేస్తుంది. ఆ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. ఆ మూవీని గుర్తు చేస్తూ ఆయన ఇలా ట్వీట్ వేశారన్నమాట. ఇక రామ్ చరణ్ సినిమాలో కూడా వీరిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్నారనే టాక్ నడుస్తోంది.