Jagapathi Babu: సౌందర్య.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ప్రేక్షకుల మదిలో కొలువుండే దేవత. అందం, అభినయం కలబోసిన రూపం ఆమె సొంతం. ఆమె చేసిన సినిమాలు, నటించిన పాత్రలు ఆమె లేని లోటును తీరుస్తూనే ఉంటాయి. ఇండస్ట్రీకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా, వెళ్ళిపోయినా సౌందర్య మాత్రం నిత్యం ప్రేక్షకుల మనస్సులో కొలువయ్యే ఉంటుంది. ఇక ఆమె గుర్తించి, ఆమె ఔన్నత్యం గురించి ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు. ఇక సౌందర్య జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. వాటితో పాటు ఎన్నో రూమర్స్ ను కూడా.. అందులో ఒకటి హీరో జగపతి బాబుతో ఆమెకు ఎఫైర్ ఉందని. ఈ జంట సినిమాల్లో కనిపిస్తే చాలు ప్రేక్షకులు నీరాజనాలు పట్టేవారు. ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరి ఆమధ్య ఎఫైర్ ఉందంటూ అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటిపై ఇద్దరిలో ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇక ఇన్నేళ్ల తరువాత జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో సౌందర్యతో ఉన్న ఎఫైర్ గురించి ఓపెన్ అయ్యారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన తమ రిలేషన్ ను బయటపెట్టారు. ఈ ఇంటర్వ్యూ ఎప్పుడో జరిగినప్పటికీ మరోమారు ట్రెండ్ అవుతోంది.
“అవును.. నాకు, సౌందర్యకు రిలేషన్ ఉంది. కానీ మీరందరు అనుకున్నది మాత్రం కాదు. మేము ఇద్దరం మంచి స్నేహితులం.. తన అన్నయ్య కూడా నాకు మంచి స్నేహితుడు. మా ఫ్యామిలీకి, వారి ఫ్యామిలీకు మధ్య ఒక అనుబంధం ఉండేది. వారి ఇంట్లో ఫంక్షన్స్ కు మేము వెళ్లేవాళ్లం. మా ఇంట్లో ఫంక్షన్స్ కు వారు వచ్చేవారు. సౌందర్య ఎంతో మంచి నటి. అలా మేము సినిమాల్లోనే కాకుండా అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్లం. అది చూసి జనాలు మా మధ్య ఎఫైర్ ఉందంటూ వార్తలు పుట్టించారు. ఆ వార్తలు నా వరకు వచ్చాయి. కానీ నేను వాటిని పట్టించుకోలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక జగపతి బాబు కెరీర్ విషయానికొస్తే వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని నటుడిగా కొనసాగుతున్నారు.