Jabardasth Naresh: జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తమదైన నటనతో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకుంటున్న ఈ కమెడియన్స్ .. ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో, ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారారు. ఇక అలా బిజీగా మారిన కమెడియన్స్ లో పొట్టి నరేష్ ఒకడు. తన హైట్ ను అడ్డంపెట్టుకొని.. కామెడీని పంచుతున్నాడు నరేష్. జబర్దస్త్ లో ప్రస్తుతం బులెట్ భాస్కర్ స్కిట్ లో చేస్తున్న నరేష్.. ఇంకోపక్క శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక గెస్ట్ గా కాకుండా అందులో ఒక భాగంగా మారిపోయాడు. నరేష్.. హైట్ చూస్తే చిన్నపిల్లాడిగా కనిపించినా.. అతను మాత్రం చిన్నపిల్లాడు కాదు. అతనికి 25 ఏళ్లు. ఇక గత కొన్ని రోజుల నుంచి నరేష్.. ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు వాటిని కొట్టిపారేసిన నరేష్.. ఎట్టకేలకు తన ప్రేమ విషయాన్నీ బయటపెట్టాడు.
Ajith: అజిత్ తో మైత్రి సినిమా.. డైరెక్టర్ ఎవరంటే.. ?
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరిముందు ఆమెకు ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చాడు. నరేష్ ప్రేమించిన అమ్మాయి.. చాలా అందంగా ఉంది. రెండేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. ఇక తన హైట్ ప్రాబ్లెమ్ లేదని, తనను ఎంతో బాగా చూసుకుంటాడని నమ్మకం ఉందని నరేష్ ప్రియురాలుచెప్పుకొచ్చింది. ఇక స్టేజిమీదనే అమ్మాయి తండ్రిని కూడా నరేష్ తో పెళ్లి మీకు ఇష్టమేనా అని అడగ్గా.. ఆయన కూడా ఇష్టమే అని చెప్పడంతో.. త్వరలోనే నరేష్ పెళ్లి ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.