Ari: ఇస్కాన్ ప్రశంసలు అందుకున్న ‘అరి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కనిపించే శత్రువుతో పోరాటం కంటే.. మనిషిలోని కనిపించని శత్రువుతో పోరాటం ఇంకా కష్టం. ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉండే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలతో పోరాటమే ‘అరి’ సినిమా. ‘అరి’షడ్వర్గాలు మనిషి పతనానికే కాకుండా ప్రకృతి వినాశనానికి దారి తీస్తుంటాయి. ఇలాంటి విభిన్న కథాశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే ‘అరి’. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రమే ‘అరి ‘. యూనివర్సిల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అరి’ చిత్రంలో మంగ్లీ పాడిన ‘చిన్నారి కిట్టయ్య’ సాంగ్‌కి అనూహ్య రీతిలో స్పందన లభించింది. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరపరిచారు. తాజాగా ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్) బెంగళూరు ప్రెసిడెంట్ మధు పండిట్ దాస ‘అరి’ చిత్ర దర్శకుడు జయ శంకర్‌ని అభినందించారు. కృష్ణ తత్వాన్ని ప్రభోదిస్తూ ‘అరి’ చిత్రాన్ని రూపొందించడంపై చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు.
అంతకు ముందు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ‘అరి’ చిత్ర ట్రైలర్, ‘చిన్నారి కిట్టయ్య’ సాంగ్ చూసి అభినందనలు తెలియజేశారు. కృష్ణ తత్వాన్ని కొత్త కోణంలో చూపిస్తూ.. ‘మనిషి ఎలా బతకకూడదు’ అనే అంశాన్ని ఆసక్తికరంగా చూపించారు తాజా ట్రైలర్లో. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఈ చిత్రానికి ఉప శీర్షిక కాగా.. ‘బ్యాడ్ ఈజ్ న్యూ గుడ్’ అనే క్యాప్షన్ ‘అరి’ చిత్రంపై ఆసక్తిరేకెత్తిస్తోంది. సాయికుమార్, సుభలేఖ సుధాకర్, అనసూయ, శ్రీకాంత్ అయ్యర్, సురభి ప్రభావతి, వైవా హర్ష ఈ ఆరుగురు ఆరు ఇంపార్టెంట్ రోల్స్‌లో కనిపించారు. వీరితో పాటు సుమన్, ఆమని, చమ్మక్ చంద్ర, శ్రీనివాస రెడ్డి ఇతర పాత్రలను పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘అరి’ చిత్రాన్ని శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి నిర్మించారు.
Also Read
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
- Tags
- Anasuya
- ARI
- ari movie
- Ari Sai Kumar
తాజావార్తలు
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!