Icon Movie : అల్లు అర్జున్ గతంలో ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తారని గతంలో అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం మారిపోయింది. అప్పటి వరకు తెలుగు, మలయాళంలో మాత్రమే మార్కెట్ ఉన్న బన్నీకి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ ఏర్పడింది. అందుకే త్రివిక్రమ్ సినిమాను కూడా వద్దనుకున్నట్టు సమచారం.
Read Also : Kingdom : అతని వల్లే కింగ్ డమ్ వాయిదా పడుతోందా..?
ఇప్పుడు ఐకాన్ సినిమాను కూడా బన్నీతో చేయట్లేదని దిల్ రాజు తెలిపాడు. త్వరలోనే కొత్త హీరోను ప్రకటిస్తామన్నారు. చూస్తుంటే ఆ కొత్త హీరో దిల్ రాజు బ్యానర్ తో మంచి సంబంధం ఉన్న విజయ్ దేవరకొండనే అని తెలుస్తోంది. ఐకాన్ అనేది హ్యూమన్ యాక్షన్ మూవీ. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్.
దీనికోసం భారీగా లుక్ ఛేంజ్ చేసుకుని కష్టపడాలంట. అందుకే మంచి ఫిజిక్ ఉన్న విజయ్ దేవరకొండవైపే మొగ్గుచూపుతున్నారంట. తమ్ముడు సినిమా అయిపోయిన తర్వాత ఈ మూవీపై వేణు శ్రీరామ్ ఫోకస్ చేస్తారంట. దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Read Also : Amitabh Bachchan : అందుకే ఐశ్వర్యను పొగడను.. అమితాబ్ షాకింగ్ కామెంట్స్