Vijay Devarakonda: లైగర్ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ ను ఏ రేంజ్ లో దెబ్బతీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఆశలు, ఎన్నో కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నాడు విజయ్. అలా ఆగిపోతే విజయ్ ఎలా వుంటాడు.. దాన్ని పట్టించుకోకుండా ముదనకు సాగుతున్నాడు. ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇకపోతే ఉదయం నుంచి రౌడీ హీరో సలార్ లో నటిస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. అనుకోకుండా దొరికిన ఒక ఫోటోను వైరల్ చేస్తూ అది సలార్ సెట్ లోదే అంటూ కొన్ని వెబ్ సైట్లు కూడా రాసుకొచ్చాయి. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది.
గత కొంత కాలంగా విజయ్ థమ్సప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెల్సిందే. థమ్సప్ కొత్త యాడ్ షూట్ లో రెండు రోజుల నుంచి విజయ్ పాల్గొంటున్నాడు. చేజింగ్ లు, ఫైటింగ్ లతో యాక్షన్ యాడ్ ను షూట్ చేస్తున్నారట. ఈ ఫోటో ఆ సెట్ నుంచి లీక్ అయ్యిందని తెలుస్తోంది. ఆ ఫోటోను పట్టుకొని, సలార్ లో విజయ్ నాటు వార్తలు రావడంతో రౌడీ అభిమానులు, ప్రభాస్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఓరి మీ దుంపలు తెగ.. మీరెక్కడ తగులుకున్నార్రా.. అంటూ రూమర్స్ క్రియేట్ చేసినవారిని తిట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.