Samantha: సమంత ఇన్స్టాగ్రామ్ హ్యాక్.. కేటీఆర్ ఫోటో షేర్ చేస్తూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ తన రోజువారీ జీవితంలో జరిగేవి అన్నీ అభిమానులతో పంచుకొంటూ ఉంటుంది. ఇక తాజాగా నిన్న సామ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లలో సడెన్ గా కేటీఆర్ ప్రత్యక్షమయ్యారు.. ఆయన ఫోటోను సామ్ షేర్ చేస్తూ “నా ప్రజలే నా బలం నా ధైర్యం నా నమ్మకం” అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఒక్కసారిగా సామ్ అభిమానులు ఉలిక్కిపడ్డారు. రాజకీయాల వైపు కన్నెత్తి కూడా చూడని సామ్ సడెన్ గా కేటీఆర్ ఫోటోను షేర్ చేయడం ఏంటా..? అంటూ తలలు బద్దలు కొట్టుకున్నారు.
సామ్ రాజకీయాల్లోకి వెళ్తున్నావా..? అంటూ కామెంట్స్ కూడా పెట్టుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ కాస్తా వైరల్ గా మారడంతో సమంత డిజిటల్ మేనేజర్ శేషాంక బినాష్ రంగంలోకి దిగింది. సామ్ ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ కు గురైందని చెప్పుకొచ్చింది. ” ఒక టెక్నీకల్ గ్లిట్చ్ వలన వేరొక గ్రూప్ లో పోస్ట్ చేయాల్సిన పోస్ట్ సమంత గ్రూప్ లో యాడ్ అయ్యింది. మేము ఈ పోస్ట్ ను యాడ్ చేసింది ఎవరు..? ఏంటి..? అనేదాని మీద ఇన్స్టాగ్రామ్ టీమ్ తో మాట్లాడుతున్నాం.. వారు ఎవరో తెలిసిన వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. మీకు ఇలాంటి కన్ప్యూజన్ కలిగించినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం” అంటూ తెలిపింది. దీంతో అభిమానులు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం సామ్ తెలుగులో యశోద, శాకుంతలం చిత్రాల్లో నటిస్తోంది.
Also Read
- Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్‌పై ముస్లిం మతగురువు ఆగ్రహం
- Zareen Khan: హద్దు దాటిన ఫోటోగ్రాఫర్.. ఇచ్చిపడేసిన హీరోయిన్! వీడియో వైరల్..
- Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
- Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ 'మనం' మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
తాజావార్తలు
-
Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్‌పై ముస్లిం మతగురువు ఆగ్రహం
-
AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
-
Preethi Mukundhan: నాకు కావలసిన మొగుడికి ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు
-
Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్‌కుమార్‌పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
-
RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!