Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇక సినిమాలు అప్పుడప్పుడు చేస్తున్నా రాజకీయాల మీదనే ఎక్కువ పెడుతున్నాడు. ఇక ఇటీవలే మంగళగిరి లో పవన్ స్పీచ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ రాజకీయాల గురించి పక్కన పెడితే.. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. అసలు విషయమేంటంటే.. ఇటీవలే పవన్.. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహరవీరమల్లు షూటింగ్ లో పాల్గొన్నాడు. దాదాపు ఈ సినిమా ఇప్పటివరకు 70% షూటింగ్ పూర్తి చేసుకున్నదని టాక్.
ఇక ఈ సినిమాతో పాటు పవన్ .. వినోదాయ సీతాం రీమేక్ కు కూడా డేట్స్ ఇచ్చాడు.. నవంబర్ లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇప్పటికి ఇంకా హరిహరవీరమల్లు 30% షూటింగ్ మిగిలి ఉండగా.. ఈ సినిమాను ఆపి.. పవన్ రీమేక్ షూటింగ్ లో పాల్గొననున్నాడట. ఎందుకంటే దీనికోసం కేవలం ఒక 20 రోజులు మాత్రమే పవన్ షూటింగ్ చేస్తే సరిపోతుంది కాబట్టి.. దీని తరువాత పవన్ బస్సు యాత్ర మొదలుపెట్టే కార్యక్రమంలో ఉన్నాడు కాబట్టి.. దీంతో హరిహరవీరమల్లు మళ్లీ వాయిదా పడినట్లే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్త విన్న అభిమానులు మరోసారి నిరాశకు గురవుతున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతోంది.. ఎప్పుడు రిలీజ్ అవుతోంది.. అని సందిగ్ధంలోనే అభిమానులు కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉన్నది అనేది తెలియాలి.