Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!

Irumudi

Irumudi

Irumudi Trailer: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఇరుముడి చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్‌కి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 12న ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా నిర్వహించనున్న భారీ లాంచ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

కుటుంబం కోసం ఓ వ్యక్తి ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడే స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ విడుదల చేసిన ట్యాగ్‌లైన్ ద్వారా తెలుస్తోంది. “When family means everything, a man will do anything for them” అనే లైన్‌తో తాజాగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సాయి కుమార్, బేబీ నక్షత్ర, విష్ణు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ఇతర ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. తాజాగా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానుల్లో మరింత జోష్ నెలకొంది. ఆగస్టు 12న భీమవరంలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్ ఎలాంటి కంటెంట్‌తో రాబోతుందో చూడాలి.