Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva Nirvana: హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ పాల్గొని ఈ సినిమా ప్రయాణం, సక్సెస్‌పై చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. సినిమా విడుదలైన రోజు ఓవర్సీస్ టాక్ కోసం తీవ్ర ఉత్కంఠకు లోనై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నానని, ఉదయం సాయికుమార్ గారు ఫోన్ చేసి పాజిటివ్ రెస్పాన్స్ చెప్పాకే ప్రశాంతత లభించిందని శివ నిర్వాణ తెలిపారు. “కొన్ని సినిమాలు అవార్డులు ఇస్తాయి కలెక్షన్లు ఇవ్వవు, మరికొన్ని విపరీతమైన కలెక్షన్లు ఇచ్చినా రొటీన్ అనే పేరు మిగులుతుంది. కానీ ‘ఇరుముడి’ నిర్మాత, దర్శకుడు, హీరో, డిస్ట్రిబ్యూటర్ నుంచి క్యాంటీన్ బాయ్ వరకు అందరికీ గౌరవాన్ని, ఆత్మసంతృప్తిని ఇచ్చింది” అని పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ కేవలం నిర్మాతలుగా కాకుండా కథలోని భావోద్వేగానికి కన్నీళ్లు పెట్టుకునేంత సెన్సిబుల్ ప్రొడ్యూసర్లు అని కొనియాడారు.
రవితేజ లాంటి మాస్ హీరోకు కథ చెప్పినప్పుడు, ఇంటర్వెల్ సీన్లో విలన్ చేతిలో దెబ్బలు తినే సన్నివేశానికి కూడా ఆయన ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా కథను నమ్మి పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. అయ్యప్ప స్వామి మాలధారణ సన్నివేశాల కోసం అవసరమైన విధంగా సహకరించి, పాత్ర కోసం ఆయన పడిన తపన వల్లే ‘త్రినాథ్’ పాత్ర అంత బలంగా వచ్చిందన్నారు. రవితేజ వద్దకు ఈ ప్రాజెక్ట్‌ను తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాసరాజుకు, కథ విని భావోద్వేగానికి గురైన రవితేజ కుమార్తె మోక్షకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కథకు వెన్నెముక గురుస్వామి పాత్రలో నటించిన సాయికుమార్ అని, ఆయన వాయిస్ బేస్, నటన సినిమాను నిలబెట్టాయని దర్శకుడు ప్రశంసించారు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర వ్యక్తిగత జీవితంలో తండ్రి లేకపోయినా, ఎమోషనల్ సీన్లలో చూపించిన పరిపక్వత అద్భుతమని కొనియాడారు. నెగటివ్ షేడ్ ఉన్న టీచర్ పాత్రలో నటించిన శ్వాసిక, ఎమ్మెల్యేగా నటించిన రమేష్ ఇంద్ర, ఎర్రాజీ పాత్రలో మెప్పించిన అజయ్ ఘోష్, అలాగే యువ నటీనటులు సామ్ (గాయత్రి), సూరి, కొమరం కిషోర్, శ్రీధర్ తదితరుల ప్రతిభ సినిమాకు బలాన్నిచ్చిందని చెప్పారు.
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చెప్పారు. అనంత శ్రీరామ్ రాసిన ‘అమ్మతో పేదరికం.. నాన్నతో రాచరికం’ పాట గుండెల్ని పిండేసేలా ఉందని, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం కూడా ఆకట్టుకుందని తెలిపారు. సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ, ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ రియలిస్టిక్ లుక్ తేవడంలో అద్భుతంగా పనిచేశారన్నారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి ప్రతిభకు జాతీయ అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పారు. ఫైట్స్ విషయంలో రియల్ సతీష్, రామ్-లక్ష్మణ్ మాస్టర్లు కథకు తగ్గట్టుగా హై-ఇంటెన్సిటీ యాక్షన్ డిజైన్ చేశారని ప్రశంసించారు.
తాజావార్తలు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
-
Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
-
Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!