Indian Idol Season 2: తెలుగు సంగీత ప్రేక్షకులను అలరించిన సింగింగ్ షో ఇండియన్ ఐడల్ తెలుగు సెకండ్ సీజన్ రాబోతోంది. తాజాగా సీజన్ 2 కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆహా సీఈవో అజిత్ ఠాకూర్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్, గాయనీ గాయకులు కార్తీక్, గీతామాధురి, హేమచంద్ర పాల్గొన్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో హిట్ అయిన షోస్ లో తెలుగు ఇండియన్ ఐడల్ ఒకటి. యువగాయనీ గాయకులకు తమ ప్రతిభ నిరూపించుకోవడానికి ఈ సింగింగ్ షో మంచి వేదికగా నిలిచింది. సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గాను మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించి సందడి చేసిన తొలి సీజన్ లో జయంత్, వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి, ప్రణతి లాంటి తెలుగు గాయనీగాయకులు తమ పాటలతో ఆకట్టుకున్నారు.
Anasuya: బావగారిని వాడు వీడు అంటావేంట్రా.. చెప్పుతో కొడతా.. దొబ్బేయ్ ఇక్కడినుంచి
తొలి సీజన్ లో వాగ్దేవి విజేతగా నిలిచింది. ఈ షో ఫైనల్స్ కు మెగాస్టార్ చిరంజీవి విచ్చేసి సందడి చేశారు. ఇప్పుడు ఈ సింగింగ్ షో సెకండ్ సీజన్ ఆరంభం అవవుతోంది. అయితే ఈ సీజన్ కు సింగర్ హేమచంద్ర హోస్ట్ చేయనున్నారు. అలాగే జడ్జిల విషయంలోనూ చిన్న మార్పు జరిగింది. నిత్యామీనన్ ప్లేస్‌లో సింగర్ గీతా మాధురి సందడి చేయనుంది. మార్చిలో ఈ షో లాంఛ్ కానుంది. ఇప్పటికే సెకండ్ సీజన్ కోసం మొత్తం 50 మంది పోటీదారులను ఎంపిక చేశారు. వీరినుంచి 12 మందిని ఎంపిక చేసి పోటీ ఆరంభించనున్నారు.