పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. హాలీవుడ్ సినిమాలకి వాడే డార్క్ సెంట్రిక్ థీమ్ తో సలార్ తెరకెక్కింది. పృథ్వీరాజ్, జగపతి బాబు మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్న సలార్ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ వచ్చారు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో టీజర్, ట్రైలర్ ని కూడా విడుదల చేసారు. ట్రైలర్ రిలీజ్ తో సలార్ హైప్ స్కై హైని తాకింది. 24 గంటలు తిరగకుండానే ఇండియాలోని అన్ని డిజిటల్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది సలార్ సినిమా. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఎలా ప్రెజెంట్ చేస్తాడు అనే ఆలోచనే సినీ అభిమానుల్లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది.
ప్రభాస్ డైనోసర్ గా కనిపించనున్న ఈ మూవీ బుకింగ్స్ డిసెంబర్ 15 నుంచి ఓపెన్ అవ్వనున్నాయి. ఆల్ సెంటర్స్ లో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని రెడీ అయినా సలార్ మూవీ సెన్సార్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు సలార్ సినిమాకి A సర్టిఫికెట్ వచ్చింది. ప్రభాస్ ఎంత వయొలెన్స్ ని చేస్తే A ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు, డ్యూరేషన్ విషయంలో కూడా సలార్ సినిమా 02 గంటల 55 నిముషాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది KGF 2 పార్ట్ 2 కన్నా ఏడు నిముషాలు ఎక్కువ. ఈ ఏడు నిమిషాల నిడివి ఎక్స్ట్రా పెట్టి ప్రశాంత్ నీల్ కాస్త ఎక్ట్రా యాక్షన్ ని చూపిస్తే బాగుంటుంది లేదా పార్ట్ 2 లీడ్ కి అవసరమైన పోస్ట్ క్రెడిట్ సీన్స్ వేస్తే బాగుంటుంది. KGF 2 సినిమాతో ప్రశాంత్ నీల్ 1200 కోట్లని రాబట్టాడు. మరి ఈసారి ప్రభాస్ తో ఏ స్థాయి కలెక్షన్స్ ని రాబడతాడు అనేది చూడాలి.