Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News In The Past The Telugu Film Ankuram Came With A Jai Bhim Style Storyline

‘జై భీమ్’కు ఇక్కడ ఎప్పుడో ‘అంకురం’!

Published Date :November 3, 2021 , 6:13 pm
By Roja Pantham
‘జై భీమ్’కు ఇక్కడ ఎప్పుడో ‘అంకురం’!
  • Follow Us :
  • google news
  • dailyhunt

నవంబర్ 2 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సూర్య ‘జై భీమ్’ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్ళంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు. థియేటర్లలో రిలీజ్ చేయాల్సిన మంచి చిత్రాన్ని సూర్య ఓటీటీలో విడుదల చేసి తప్పు చేశారని కొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు. సూర్య అభిమానులు మాత్రమే కాకుండా, మంచి సినిమాను ప్రేమించే అందరూ ‘జై భీమ్’ చిత్రాన్ని సొంతం చేసుకుని విశేష ప్రచారం చేస్తున్నారు.

నిజానికి ఇదే తరహా కథాంశంతో గతంలో తెలుగులో 1995 లో ‘అంకురం’ చిత్రం వచ్చింది. రెండు చిత్రాల కథ పూర్తిగా ఒక్కటే అని చెప్పలేం కానీ చాలా విషయాలలో సామీప్యత కనిపిస్తుంది. గిరిజనులకు జరిగే అన్యాయాన్ని, ముఖ్యంగా పోలీసులు వారి పట్ల ఎంత అమానవీయంగా ఉంటారనే విషయాన్ని ఈ రెండు చిత్రాల్లోనూ ప్రధానంగా చూపించారు. మానవ హక్కులను కాపాడే లాయర్ చంద్రూగా ‘జై భీమ్’లో సూర్య నటిస్తే, ‘అంకురం’లో అదే తరహా పాత్రను శరత్ బాబు పోషించాడు. ఓ గిరిజనుడిని పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు, గర్భవతి అయిన అతని భార్యను అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టడాన్ని ఆపైన ఆమె మరణానికి కారణమవడాన్ని ‘అంకురం’లో చూపించారు. ‘జై భీమ్’లోనూ దొంగతనం కేసు మోపబడిన రాజన్నను పట్టుకోలేక గర్భవతి అయిన అతని భార్య చిన్నతల్లిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి దారుణంగా హింసిస్తారు. ‘అంకురం’లో పోలీసుల చేతిలో చిక్కి ఏమై పోయాడో తెలియని సత్యం ఆచూకి కోసం కథానాయిక ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో లాయర్ తో కలిసి పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతుంది. ‘జై భీమ్’లోనూ పోలీసులు అరెస్ట్ చేసిన రాజన్న ఆచూకీ కోసం విద్యా వాలంటరీ అయిన మైత్రీ, మానవ హక్కుల లాయర్ చంద్రూ తో కలిసి పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతుంది. ఓ పోలీస్ స్టేషన్ గోడ మీద ఉన్న రాతలతో సత్యం అరెస్ట్ అయిన విషయం ‘అంకురం’లో కథానాయికకు తెలిస్తే, ఓ పోలీస్ స్టేషన్ లో రోడ్డు ప్రమాదం జరిగిన రికార్డుల కారణంగా ‘జై భీమ్’లో రాజన్నను పోలీసులు లాకప్ డెత్ చేశారనేది బయటపడుతుంది. రెండు సినిమాలలోనూ కనిపించని వక్తులు కోసం కోర్టులు కమీషన్స్ ను వేస్తాయి. హెబియస్ కార్పస్ పిటీషన్ ఆధారంగానే రెండు చోట్ల మిస్సింగ్ పర్శన్ ను వెదకడం చేస్తారు.

Also Read

  • Peddi: రామ్ చరణ్ 'పెద్ది' నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
  • Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్.. "రాత్రి 12 గంటలకు నా రూమ్‌లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!"
  • Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!
  • Ramya Krishna : తెల్లవారితే పెళ్లి.. కానీ రాత్రి 2 గంటల వరకు షూటింగ్!

‘అంకురం’ చిత్రంలో చారుహాసన్ పోషించిన పాత్రకు డాక్టర్ రామనాథం స్ఫూర్తి కాగా, ‘జై భీమ్’లో సూర్య పోషించిన పాత్రకు మానవ హక్కుల లాయర్ చంద్రూ స్ఫూర్తి. అయితే… ‘జై భీమ్’ సినిమాను సహజత్వానికి దగ్గరగా దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించగా, తెలుగులో సి. ఉమామహేశ్వరరావు ఓ నవ వధువు జీవితంలో తారసపడిన ఊహకందని సంఘటనల సమాహారంగా ‘అంకురం’ చిత్రాన్ని తీశారు. అప్పట్లో ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. సి. ఉమామహేశ్వరరావు కు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు లభించింది. రేవతి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును పొందారు. అలానే ఇండియన్ పనోరమాకు ఈ సినిమా ఎంపికై మెయిన్ స్ట్రీమ్ కేటగిరిలో ప్రదర్శితమైంది.

‘అంకురం’లోని అంశాలు ‘జై భీమ్’లోనూ ఉండటాన్ని దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన ఆనాటి రోజుల్ని తలుచుకున్నారు. ‘అంకురం’ సినిమా తెరకెక్కించడానికి దాదాపు పది సంవత్సరాలు శ్రమపడ్డానని, రకరకాల కారణాలతో పలువురు ఈ సినిమాను నిర్మించడానికి వెనకడుగు వేశారని అన్నారు. అయితే సురేశ్ కుమార్ ‘అంకురం’ను నిర్మించడానికి ముందుకు వచ్చిన తర్వాత కూడా రెండేళ్ల పాటు ఈ చిత్ర నిర్మాణం సాగిందని అన్నారు. సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం తాను చూశానని, తనకెంతో నచ్చిందని చెప్పారు. ‘జై భీమ్’ చిత్ర కథాంశం 1995 కాలం నాటిదే అయినా ఇప్పటికీ అవే పరిస్థితులు సమాజంలో ఉన్నాయని, చట్టం దృష్టిలో అందరూ సమానమే అనే అందరూ చెబుతుంటారని, కానీ కొందరు దృష్టిలో అది ఎక్కువ సమానమని, అట్టడుగు వర్గాల వారికి తక్కువ సమానమని సి. ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ‘జై భీమ్’లోనూ ఇదే అంశాన్ని దర్శకుడు చూపించడం తనకు నచ్చిందని చెబుతూ, ఆ చిత్ర బృందాన్ని అభినందించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ankuram
  • Jai Bhim
  • Revathi
  • sharath babu
  • surya

తాజావార్తలు

  • Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!

  • Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..

  • Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!

  • Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్‌లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”

  • Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్‌మిలన్ ధరలు..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions