Liger Rating: అర్జున్ రెడ్డితో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కెరీర్లో తొలిసారిగా పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ తెరకెక్కింది. అయితే అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కథ, కథనాలు సాధారణంగా ఉన్నాయని అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ మూవీ సైట్ ఐఎండీబీ ఇచ్చే రేటింగ్‌లో లైగర్ మూవీ అత్యల్ప రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ మూవీకి ఐఎండీబీ కేవలం 10కి 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఈ రేటింగ్ బాలీవుడ్లో ఇటీవల విడుదలైన లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ చిత్రాల కంటే తక్కువ అని తెలుస్తోంది.
Read Also: Chiranjeevi: మహిళా అభిమాని కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్న మెగాస్టార్
అమీర్ ఖాన్ కెరీర్లో అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచిన లాల్ సింగ్ చద్దా మూవీకి ఐఎండీబీ రేటింగ్ 5 ఇచ్చింది. అటు అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్ చిత్రానికి 4.6 రేటింగ్ కట్టబెట్టింది. ఆయా సినిమాలతో పోలిస్తే లైగర్ మూవీకి అత్యంత పేలవమైన రేటింగ్ రావడం చిత్రబృందానికి షాక్ గురిచేస్తోంది. అటు బుక్ మై షోలోనూ 60 శాతం మాత్రమే రేటింగ్ ఉంది. ఇటీవల విడుదలైన బింబిసార, సీతారామం, కార్తీకేయ-2 సినిమాలకు 90 నుంచి 95 శాతం వరకు రేటింగ్ నమోదైంది. లైగర్ సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి దారుణమైన స్పందన రావడంతో చిత్ర యూనిట్ కూడా సైలెంట్ అయిపోయింది. హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా షూటింగ్ సన్నాహాలతో బిజీగా ఉన్నాడు. లైగర్ చిత్రానికి హైప్ ఎక్కువగా ఉండటంతో తొలిరోజు వసూళ్లు బాగానే వచ్చాయి. కానీ రెండో రోజు నుంచి వసూళ్లలో భారీ డ్రాప్స్ కనిపించాయి.
