Prabhas Fauji: ప్రభాస్ కోసం కొత్త భామ.. ఎవరీ ఇమాన్వి.. ఇంత క్యూట్ గా ఉందేంటి?
- ప్రభాస్ కోసం కొత్త భామ
- ఎవరీ ఇమాన్వి? ఇంత క్యూట్ గా ఉందేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iman Esmail Aka Imanvi to Romance With Prabhas in Fauji: ముందుగా ప్రచారం జరిగినట్టుగానే హను రాఘవపూడితో ప్రభాస్ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈరోజు ప్రారంభించింది. చాలా కాలం నుంచి అనేక ప్రచారాలతో వార్తలలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా ప్రారంభించబడింది. అసలు విషయానికి వస్తే ప్రభాస్-హను ప్రాజెక్ట్ ఓపెనింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలోనే మనకు పరిచయం లేని ఒక పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదే ఇమాన్ ఎస్మాయిల్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇమాన్ ఎస్మాయిల్ కథానాయికగా నటిస్తోంది. అయితే ప్రెస్ రిలీజ్ లో ఆమె పేరును ఇమాన్వి అని అనౌన్స్ చేశారు. ఆసక్తికర అంశం ఏమిటంటే ఆమె ఇన్స్టా హ్యాండిల్ లో కూడా ఇమాన్వి అనే ఉంది. ఇక ఆమె గురించి ఇంత వైరల్ అవడానికి కారణం ఆమె పాకిస్తాన్లో జన్మించిన వ్యక్తి. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ఇమాన్వి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. మొదటి సినిమానే తెలుగులో ప్రభాస్ తో అది కూడా పాన్ ఇండియా లెవల్లో అంటే అది మామూలు అదృష్టం కాదు.
Roshan : శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా షురూ
Also Read
ఈ రోజు లాంచ్ వేడుకలో ఇమాన్వి విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అవడం మొదలైంది. ఆమె పేరు ఇప్పటికే ట్రెండ్ అవడం మొదలైంది. అంతేకాదు ఆమె సౌందర్యలా అనిపిస్తోస్తోందని, టాలీవుడ్‌లో తదుపరి పెద్ద హీరోయిన్ అవచ్చని టాక్ మొదలైంది. హను తన మొదటి సినిమా నుంచే తన హీరోయిన్స్ ను చాలా అందంగా చూపిస్తాడని పేరుంది. ఇది ఇమాన్వికి మరో ప్లస్ పాయింట్. ఆమె తన అరంగేట్రం కంటే ముందే సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో న్యూస్ అయిందని చెప్పొచ్చు. పాకిస్తానీ మూలాలు ఉన్నా ఇమాన్వి ఢిల్లీలో సెటిల్ అయింది. ఆమె మంచి డ్యాన్సర్, నటి. ఆమెకు ఆన్‌లైన్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ పాలనలో జరిగే పీరియాడికల్ డ్రామా, అని ఈ ప్రేమకథలో ప్రభాస్ ఆర్మీ మేన్‌గా కనిపించనున్నాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఇందుకోసం రామోజీ ఫిల్మీ సిటీలో భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఈ సెట్‌లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరగనుంది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ మళ్లీ రొమాన్స్ జోనర్‌లోకి వచ్చి చేస్తున్న సినిమా ఇది.
తాజావార్తలు
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..