Ileana: దేవదాసు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఇలియానా. చిట్టి నడుముతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ
స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం మొదలుపెట్టింది. వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందని కొందరు.. సీక్రెట్ గా ఈ జంట పెళ్లి కూడా చేసుకున్నారని మరికొందరు చెప్పుకొచ్చారు. ఇక ఈ జంట ప్రేమ మూడునాళ్ల ముచ్చటగానే మారింది. 2019 లో ఈ జంట విడిపోయారు. ఇక ప్రేమ విఫలమవడంతో ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. దానివలన ఆమె బరువు పెరిగింది. సినిమాలు తగ్గించింది.
దాదాపు మూడేళ్లు బ్రేకప్ బాధలో ఉన్న ఇల్లీ బేబీ ఆ తరువాత కెరీర్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇన్నాళ్లకు మరోసారి ప్రేమలో పడింది అనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇల్లీ బేబీని లవ్ లో పడేసింది ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెన్స్ మిచెల్ అని టాక్. గత 6 నెలలుగా ఈ జంట డేటింగ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇక నేడు కత్రినా పుట్టినరోజు వేడుకలో ఇలియానా హంగామా అంతా ఇంతా కాదు. కత్రినా ఫ్యామిలీ తో కలిసి ఇలియానా పోజులివ్వడం చూస్తుంటే ఈ డేటింగ్ వార్తలు నిజమేనని అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ ఈ ప్రేమాయణంపై ఇల్లీ బేబీ ఎలా స్పందిస్తుందో చూడాలి.