Bhavatharini: డియర్ డాటర్.. ఏడిపిస్తున్న ఇళయరాజా పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhavatharini: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకున్న విషయం తెల్సిందే.. ఆయన కుమార్తె భవతారణి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక భవతరణి మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, ఇళయరాజా అభిమానులు ఆమెకు సంతాపం ప్రకటించారు. ముఖ్యంగా విశాల్.. చాలా ఎమోషనల్ అయిన విషయం కూడా తెల్సిందే. ఇక తాజాగా కూతురును తలుచుకొని ఇళయరాజా కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆమె చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ.. జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇళయరాజా హెడ్ ఫోన్స్ పెట్టుకొని.. పక్కనే ఉన్న భవతారణికి పుస్తకంలో ఉన్న ప్రముఖులను పరిచయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ ఫొటోకు క్యాప్షన్ గా డియర్ డాటర్ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కూతురు జ్ఞాపకాలతో ఇళయరాజా ఎంత కుంగిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ఫోటో చాలు.. తండ్రీకూతుళ్ళు ఎలా ఉండేవారో తెలుస్తోందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక భవతరిణి గురించి చెప్పాలంటే.. ఆమెకు గాయనిగా కోలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. 2000 సంవత్సరంలో వచ్చిన భారతి అనే సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా.. ఆ సినిమాలో మాయిల్ పోలా పొన్ను ఒన్ను అనే పాటను భవతరిణి పాడింది. ఈ పాటతో ఆమె నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఫ్రెండ్స్, పా, టైమ్, ఒరు నాళ్ ఒరు కనవు, అనెగన్ తదితర చిత్రాల్లో పలు పాటలు పాడి మెప్పించింది. ఫిర్ మిలేంగే, ఇలక్కనమ్, వెల్లాచి, అవునా తదితర సినిమాలకు సంగీత దర్శకురాలిగా వ్యవహరించారు. చివరగా 2019లో వచ్చిన మాయానది అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకురాలిగా పనిచేసింది.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
அன்பு மகளே… pic.twitter.com/GgtnKGyvQ1
— Ilaiyaraaja (@ilaiyaraaja) January 26, 2024
తాజావార్తలు
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!