Ilaiyaraaja: అమ్మగా ‘మ్యూజిక్ స్కూల్’లోకి అడుగుపెట్టిన శ్రియా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ మూవీ హైదరాబాద్, గోవా సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో మొత్తం 11 పాటలున్నాయి. అందులో మూడు పాటలు కేవలం మ్యూజిక్‌తోనే సాగుతాయి. కిరణ్ డియోహన్స్ తన కెమెరా పనితనంతో విజువల్స్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించి సినిమాను నెక్ట్స్ లెవల్లో తీసుకెళ్లారని రైటర్ కమ్ డైరెక్టర్ పాపారావు బియ్యాల భావిస్తున్నారు. అలాగే శర్మన్ జోషి, శ్రియా శరన్ తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారని ఆయన తెలిపారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!

ఈ సందర్భంగా శ్రియా శరన్ మాట్లాడుతూ ”‘మ్యూజిక్ స్కూల్’ ఓ అద్భుతమైన స్క్రిప్ట్. తల్లిగా మారిన తర్వాత ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాను. కాబట్టి ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైనది. నేను చిన్న పాపగా ఉన్నప్పటి నుంచి ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ వింటూ పెరిగాను. ఇప్పుడు వాటిలో కొన్నింటికి ‘మ్యూజిక్ స్కూల్’లో నటించటం అనేది గొప్ప వరంగా భావిస్తున్నాను. అద్భుతమైన నటీనటులు, చిన్న పిల్లలు, టెక్నికల్ టీమ్‌తో కలిసి ఈ సినిమా కోసం పని చేశాను. శర్మన్ జోషిగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడూ నేను నవ్వుతూ ఉండేలా చూసుకున్నారు. అలాగే యామిని రావుగారికి ధన్యవాదాలు. మా యూనిట్‌కు ఏది అవసరమో దాన్ని సమయానికి ఏర్పాటు చేయటంలో వారు ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఓ గొప్ప పాత్రను క్రియేట్ చేసి అందులో నన్ను నటింప చేసినందుకు దర్శకులు పాపారావుగారికి ధన్యవాదాలు. ఆయన తొలి సినిమా ఇది. అయినప్పటికీ ఆయన విజన్ ఎంతో గొప్పగా ఉంది. నా కలను నిజం చేసిన కిరణ్‌గారికి థాంక్స్. ఇది నాకెప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాను” అని అన్నారు.
శర్మన్ జోషి మాట్లాడుతూ ”మ్యూజిక్ స్కూల్’ సినిమా ప్రయాణం ముగిసింది. షూటింగ్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేశాం. ఎన్నో అనుభూతులున్నాయి. వాటని ఇప్పుడు ప్రేక్షకులకు అందించబోతున్నాం. ఓ గొప్ప ప్యాషన్‌తో ఎవరూ ఊహించని విధంగా భారీ స్కేల్‌తో ఇలాంటి అద్భుతమైన సినిమా చేసిన ప్యాషనేట్ డైరెక్టర్ పాపారావుగారి నుంచి మరిన్ని గొప్ప చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
యామిని ఫిలింస్ బ్యానర్ రూపొందించిన ఈ చిత్రంలో శ్రియా శరన్, శర్మన్ జోషి, షాన్, ప్రకాష్ రాజ్, లీలా శామ్సన్, సుహాసిని ములే, బెంజిమన్ గిలాని, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ, మోనా అంబేగోనకర్, గ్రేసీ గోస్వామి, ఓజు బారువా, బగ్గ్ భార్గవ, మంగళ భట్, ఫణి ఎగ్గొట్టి, వకార్ షేర్, ప్రవీణ్ గోయెల్, రజినీష్ కార్తికేయ, రోహన్ రాయ్, ఒలివియా చారన్, వివాన్ జైన్, సిద్ధిక్ష, ఆద్య, ఖుషి తదితరులు నటించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు