Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Ilaiyaraaja Birthday Special

Ilaiyaraaja :అసలైన ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా!

Published Date :June 2, 2022 , 6:00 am
By Subbarao N
Ilaiyaraaja :అసలైన ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏడు వేలకు పైగా పాటలు… 1400 పై చిలుకు సినిమాలు… ఇరవై వేలకు పైగా కాన్సర్ట్స్… ఒకే సంగీత దర్శకుడు సుసాధ్యం చేశారంటే నమ్మశక్యమా!? అవును, నమ్మితీరాలి… ఎందుకంటే ఆ ఫీట్ సాధించిన వారు ఇళయరాజా! కాబట్టి సాధ్యమే అని నమ్మవచ్చు. తన తరం సంగీత దర్శకుల్లో ఇళయరాజా లాగా అభిమానగణాలను సంపాదించిన వారు మరొకరు కానరారు. తెరపై ఇళయరాజా పేరు కనిపించగానే అభిమానుల ఆనందం అంబరమంటేది. దాదాపుగా స్టార్ హీరోల స్థాయిలో ఇళయరాజా పేరు మారుమోగి పోయింది. ఇక ఆయన సంగీతం సమకూర్చిన చిత్రాలతోనే ఎంతోమంది స్టార్స్ గా వెలిగారు. అందుకే ఇళయరాజాను ‘స్టార్ ఆఫ్ స్టార్స్, కింగ్ ఆఫ్ మెలోడీ, మేస్ట్రో, ఇసై జ్ఞాని’ అంటూ అభిమానులు కీర్తిస్తూనే ఉన్నారు. ఉన్నది సప్తస్వరాలే, వాటితో పలికే రాగాలెన్నో! ఉన్నది ఒక్కడే ఇళయరాజా, ఆయన పలికించిన మధురం ఎంతో! ఈ నానుడి తమిళనాటనే కాదు, తెలుగునేలపైనా విశేషంగా వినిపిస్తుంది.

ఇళయరాజా అసలు పేరు ఆర్. జ్ఞానదేశిగన్. 1943 జూన్ 2వ తేదీన ఆ నాటి సంయుక్త మద్రాసు రాష్ట్రంలోని తేని జిల్లా పన్నై పురంలో జన్మించారు. స్కూల్ లో చేర్పించేటప్పుడు రాజయ్యగా పేరు మార్చారు. ఆయన ఊరిజనం ‘రాసయ్య’ అంటూ పిలిచేవారు. తరువాత గురువు ధనరాజ్ మాస్టర్ ఆ పేరును ‘రాజా’గా మార్చారు. చిత్రసీమ చిత్రమైనది. ఇక్కడ ఎన్నో చిత్రవిచిత్రాలు సాగుతూ ఉంటాయి. ఆరంభంలో తనకు గిటారిస్ట్ గా అవకాశమిస్తే చాలు, ఆ రోజు కడుపు నింపుకోవచ్చు అని ఆశిస్తూ ఎందరో సంగీత దర్శకుల గుమ్మాల చుట్టూ తిరిగారు రాజా. తెలుగువారైనా కన్నడ సీమలో తనదైన బాణీ పలికించిన జి.కె.వెంకటేశ్ వద్ద తమిళ తంబీ రాజాకు అవకాశం లభించింది. ఆయన వద్ద పలు చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు రాజా. తొలి చిత్రం ‘అన్నకిలి’తో ఆయన పేరును ఇళయరాజాగా మార్చారు. ఆ తరువాత నుంచీ ఇళయరాజా ఏ నాడూ వెనుతిరిగి చూసుకోలేదు.

తెలుగు చిత్రసీమలో ఇళయరాజా బాణీలు పలుకక మునుపే, ఆయన తమిళంలో రూపొందించిన స్వరకల్పనను పలువురు ప్రముఖ సంగీత దర్శకులే అనుసరించారు. దీనిని బట్టే ఇళయరాజా గొప్పతనమేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘భద్రకాళి’ మొదలు మొన్నటి ‘శ్రీరామరాజ్యం’ దాకా ఇళయరాజా తెలుగువారిని ఆకట్టుకొనే స్వరాలు పలికించారు. చిరంజీవి-కోదండరామిరెడ్డి-కెఎస్. రామారావు-యండమూరి కాంబోలో వచ్చిన నవలా చిత్రాలకు ఇళయరాజా బాణీలు ప్రాణం పోసిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు? చిరంజీవికి అనేక మ్యూజికల్ హిట్స్ అందించిన ఇళయరాజా, నాటి వర్ధమాన హీరోలందరికీ తన స్వరాలతో సక్సెస్ రూటు చూపించారు. మూడుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలచిన ఇళయరాజాకు రెండు సార్లు తెలుగు చిత్రాల ద్వారానే (సాగరసంగమం, రుద్రవీణ) నేషనల్ అవార్డు దక్కడం విశేషం. తమిళనాట పుట్టినా, తెలుగువారిని ఇళయరాజా స్వరకల్పన అలరించిన తీరు అనితరసాధ్యం అనే చెప్పాలి. మన తెలుగు చిత్రాల ద్వారా విశేషఖ్యాతి ఆర్జించిన పరభాషా సంగీత దర్శకులలో ఇళయరాజా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఈ నాటికీ ఇళయరాజా బాణీలకు ఫిదా అయిపోయేవారెందరో ఉన్నారు. 80వ పడిలో అడుగు పెట్టిన ఇళయరాజా మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • birthday special
  • Ilaiyaraaja
  • Ilaiyaraaja birthday special
  • music director

తాజావార్తలు

  • “Dhurandhar The Revenge” చిత్ర యూనిట్‌కు బిగ్‌ షాక్.. విడుదలైన ఫస్ట్ డేనే పాకిస్థాన్‌లో పైరసీ కాపీ ప్రత్యక్షం!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • UstaadBhagatSingh Frist Day Collections : ఉస్తాద్ భగత్ సింగ్ మెుదటి రోజు కలెక్షన్స్.. డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ షాక్

  • US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు చావుదెబ్బ.. 16 యుద్ధ విమానాలు ధ్వంసం!

ట్రెండింగ్‌

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions