దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికుడు సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఇక్కీస్’ (Ikkis) . ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద హీరోగా ఎంట్రీ ఇస్తుండడం విశేషం. అగస్త్య సరసన లెజెండరీ నటుడు ధర్మేంద్ర, ‘పాతాళ్ లోక్’ ఫేం జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థ్రిల్లింగ్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీరామ్ రాఘవన్ ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : Allu Sirish: అల్లూ శీరీష్ ఎంగేజ్ మెంట్ పై తుపాను ఎఫెక్ట్.. అనుకున్నదొకటి, అయినది మరొకటి..?
తాజాగా విడుదలైన ట్రైలర్‌లో 1971 ఇండో-పాక్ యుద్ధం నాటి వాస్తవ సంఘటనలను రియలిస్టిక్‌గా చూపించారు. కేవలం 21 ఏళ్ల వయసులోనే దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అరుణ్ ఖేతర్‌పాల్ వీరత్వం గుండెల్లో గర్వాన్ని నింపుతుంది. ట్యాంక్ యుద్ధాల సన్నివేశాలు, సైనికుల మధ్య భావోద్వేగాలు, దేశభక్తి భావాలు అన్ని ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. యుద్ధ క్షేత్రంలో నడిచిన ఈ నిజ జీవిత కథలో ధైర్యం, త్యాగం, దేశభక్తి అన్నీ నిండుగా కనిపిస్తాయి. అగస్త్య నంద డెబ్యూ ఫిల్మ్‌గా ‘ఇక్కీస్’ అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రం, మరోసారి బాలీవుడ్‌లో పాత తరం వారసుల ప్రతిభను గుర్తు చేయనుంది.