గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ జోష్‌లో ఇక నుంచి అసలు సిసలైన సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పుకొచ్చాడు బాలయ్య. అందుకు తగ్గట్టే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవర్ హౌజ్ కాంబో రిపీట్ చేస్తూ బోయపాటి శ్రీనుతో అఖండ 2 చేస్తున్నారు. ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి.
Also Read : RT 75 : రవితేజ ‘మాస్ జాతర’ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమాలు చేయడానికి ఇద్దరు దర్శకులు దాదాపుగా ఫిక్స్ అయ్యారనే చెప్పాలి. వీరసింహారెడ్డితో బ్లాస్టింగ్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. అఖండ 2 తర్వాత ఈ కాంబోలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక తాజాగా డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీ కూడా మరోసారి బాలయ్యతో అదిరిపోయే సినిమా చేస్తానని ప్రకటించాడు. ఈ సారి బాలయ్యతో డాకు మహారాజ్‌ని మించి పాన్ ఇండియా భాషలలో గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నాను అని ప్రకటించాడు బాబీ. ఈ మూడు సినిమాలతో పాటు తమిళ్ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న’ జైలర్ -2′ లో బాలయ్య స్పెషల్ రోల్ చేయనున్నాడని కూడా చెన్నై సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఇలా నాలుగు సినిమాలతో సాలిడ్ లైనప్ తో అన్ స్టాపబుల్ గా సాగుతోంది బాలయ్య సినీ కెరిర్.