ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 400 రోజులు అయ్యింది. ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. సెలబ్రిటీస్ నుంచి కామన్ ఆడియన్స్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ చూపించిన మ్యానరిజమ్స్ ని ఫాలో అయ్యారు అంటే పుష్పరాజ్ రీచ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా పుష్ప ది రైజ్ సినిమాని రష్యాలో కూడా రిలీజ్ చేశారు, అక్కడ కూడా పుష్పరాజ్ హవా కొనసాగింది. మొదటి పార్ట్ తో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్, రెండో పార్ట్ పుష్ప ది రూల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రతి ఇండస్ట్రీలో పాతుకుపోతాడు అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు కానీ అల్లు అర్జున్ అండ్ టీం మాత్రం పుష్ప ది రూల్ సినిమాని డిలే చేస్తూనే వచ్చారు.
బజ్ తగ్గిపోతుంది, ఆడియన్స్ మర్చిపోతున్నారు, ఒక్క అప్డేట్ అయినా ఇవ్వండి అంటూ అల్లు అర్జున్ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఎవరు ఎంత చేసినా బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చెయ్యాలి అంటే టైం కావాలి, ఆ టైంని తీసుకొనే పుష్ప ది రూల్ సినిమాని పర్ఫెక్ట్ గా క్రాఫ్ట్ చేస్తున్నాడు సుకుమార్. ఇటివలే స్టార్ట్ అయిన ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి అల్లు అర్జున్ వైజాగ్ వెళ్లాడు. ఈ సంధర్భంగా ఫాన్స్ అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఐకాన్ స్టార్ తో ఫోటోస్ కోసం ఎగబడ్డారు. పుష్ప ది రూల్ షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాని నిలబెట్టే అవకాశం ఉంది. మొదటి పార్ట్ కన్నా గ్రాండ్ గా, ఇంటన్స్ గా పుష్ప ది రూల్ సినిమా ఉంటుందట.