Site icon NTV Telugu

I Bomma Ravi : డబ్బు సంపాదించట్లేదని భార్య, అత్త హేళన.. పైరసీ వైపు రవి

Ibomma Ravi

Ibomma Ravi

I Bomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో త్వవేకొద్ది చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఐ బొమ్మ రవి పైరసీ చేయడం వెనక ఇప్పుడు మరో కోణం పోలీసుల విచారణలో బయట పడింది. రవి 2016లో బాగా డబ్బున్న ముస్లిం ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ కూతురు పుట్టాక ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవలు వచ్చాయి. ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని ఆ స్థాయిలో రవి చూసుకోలేకపోయాడు. నెలవారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో భార్య, అత్త నీకు డబ్బు సంపాదించడం చేతకాదు.. ఫ్యామిలీని పోషించడం రాదు అంటూ అవమానించారు. దీంతో రవిలో కసి పెరిగిపోయింది.

Read Also : Priyanka Chopra : శభాష్ ప్రియాంక చోప్రా.. మిగతా హీరోయిన్లు చూసి నేర్చుకోండి..

వెబ్ డిజైన్ల మీద తనకున్న పట్టుతో పైరసీలు చేయడం స్టార్ట్ చేశాడు. అలా 2018లో ఐ బొమ్మ, 2022లో బప్పం టీవీ సైట్లు పెట్టాడు. సినిమాలను పైరసీ చేస్తూ లక్షల్లో సంపాదించాడు. అదే సమయంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే కోట్లు వచ్చాయి. ఆ డబ్బంతా భార్యకు చూపించినా సరే ఆమె రవితే ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో 2021లో ఇద్దరూ విడిపోయారు. రవికి ఓ కూతురు ఉంది. 2022 నుంచి రవి విదేశాల్లోనే ఉంటున్నాడు. కరేబియన్ సిటిజన్ షిప్ తీసుకుని అక్కడే ఉంటూ పైరసీలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆస్తులు అమ్ముకోవడానికి ఇండియాకు రావడంతో పోలీసులు ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు.

Read Also : I Bomma Ravi : సజ్జనార్ కు రవి తండ్రి రిక్వెస్ట్… మనవరాలి కోసం..

Exit mobile version