ఒక భాషలో ఒక సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే దాన్ని ఇంకో భాషలో రీమేక్ చేసి హిట్ కొట్టడానికి దర్శక నిర్మాతలు హీరోలు రెడీగా ఉంటారు. ఒటీటీ వచ్చి అన్ని భాషల కంటెంట్ అందరికీ అవైలబుల్ గా ఉంది, సో రీమేక్స్ కాస్త తగ్గుతాయి అనుకుంటే అలా ఏం లేదు. దేని బిజినెస్ దానిదే అన్నట్లు… స్టార్ హీరోలు కూడా హిట్ సినిమాలని రీమేక్ చేస్తున్నారు. చిరు, పవన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తుంటే యంగ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ మాత్రం రీమేక్స్ కి స్ట్రెయిట్ అవే నో చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం రణబీర్ కపూర్ తను నటించిన లేటెస్ట్ మూవీ ‘తూ ఝూతి మైన్ మక్కార్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మార్చ్ 8న రిలీజ్ కానున్న ఈ మూవీ మీడియా ఇంటరాక్షన్స్ లో రణబీర్ కపూర్ రీమేక్స్ గురించి తన ఒపినీయన్ ని షేర్ చేసుకున్నాడు.
“నేను నా కెరీర్ స్టార్టింగ్ లోనే రీమేక్స్ చెయ్యకూడదు అని డిసైడ్ అయ్యాను. సినిమానే కానే ఒక పాటని కూడా రీమిక్స్ చెయ్యకూడదు అనుకున్నాను కానీ ‘బచ్నా ఏ హసీనో’ అనే పాటని రీమిక్స్ చెయ్యాల్సి వచ్చింది. అప్పుడు నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను, నో చెప్పలేకపోయాను. ఇష్టం లేకపోయినా ఆ పని చేశాను, ఇప్పుడు అలా కాదు. ఒరిజినల్ కంటెంట్‌ని క్రియేట్ చేయగల పొజిషన్‌లో నేను ఉన్నాననే నమ్మకం ఉంది. ఒకవేళ నేను నిజంగానే రీమేక్ చెయ్యాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ‘అమర్ అక్బర్ ఆంథోనీ’లో ‘ఆంథోనీ’ పాత్ర నాకు చాలా ఇష్టం, అది చాలా ఇంటరెస్టింగ్ ఉంటుంది. అలానే ‘జమానే కో దిఖానా హై’ అనే సినిమాలో మా నాన్న (రిషి కపూర్) హిట్ అవ్వలేదు కానీ బాగుంటుంది. నాకు ‘శ్రీ 420’ కూడా ఇష్టం. ఒకవేళ రీమేక్ చెయ్యాల్సి వస్తే మాత్రం వీటిలో ఎదో ఒకటి రీమేక్ చెయ్యడానికి ఓకే చెప్తాను” అంటూ రణబీర్ కపూర్ మాట్లాడాడు. కెరీర్ లో ఇప్పటివరకూ రీమేక్ చెయ్యకుండా సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రణబీర్ కపూర్ ఇటివలే బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సినిమాతో 400 కోట్లు కలెక్ట్ చేసి హిందీ మార్కెట్ ని ప్రాణం పోశాడు. ఈ మూవీ సౌత్ లో కూడా బాగానే ఆడింది.