KGF: రాకీ భాయ్‌ని ఫాలో అయ్యాడు.. ఆసుపత్రిపాలయ్యాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువతపై సినిమాల ప్రభావం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక స్టార్ హీరో సినిమా వచ్చిందంటే చాలు.. వాళ్ళ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ స్టైల్, యాటిట్యూడ్ దాకా.. అన్ని అనుసరించడం మొదలుపెడతారు. దాదాపు తమ అభిమాను హీరోలు సినిమాల్లో చేసిన పనులనే, రియల్ లైఫ్‌లోనూ చేయాలని ప్రయత్నిస్తారు. కొందరైతే స్టంట్లు కూడా చేస్తుంటారు. ఇలా చేసి కొందరు లేనిపోని సమస్యల్లో చిక్కుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ టీనేజ్ కూడా.. తన అభిమాన హీరోలాగే ఓ ఫీట్ చేయబోయే, ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘కేజీఎఫ్: చాప్టర్2’ని చూసిన ఓ కుర్రాడు, అందులో హీరో సిగరెట్ తాగే స్టైల్‌కి ఫిదా అయ్యాడు. తానూ సరిగ్గా అలాగే చేయాలని అనుకున్నాడు. అంతే, వెంటనే ఒక సిగరెట్ ప్యాకెట్ కొన్నాడు. హీరోలా ఫీల్ అవుతూ, సిగరెట్లన్నీ తాగేశాడు. రెండు రోజుల్లో మొత్తం మూడు ప్యాకెట్లు ఖాళీ చేశాడు. అయితే, ఒకేసారి అన్నీ సిగరెట్స్ కాల్చడం వల్ల అతనికి తీవ్ర గొంతు నొప్పి వచ్చింది. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. ఆ బాధను భరించలేక, విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో.. వాళ్ళు వెంటనే ఆ అబ్బాయిని బంజారాహిల్స్‌లోని సెంచురీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం అందాక ఆ అబ్బాయి సాధారణ స్థితికి వచ్చాడు.
Also Read
- The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
ఈరోజుల్లో యువతపై సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో తరచూ గమనిస్తూ ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఒకవేళ అబ్బాయి భయపడి అసలు విషయం చెప్పకుండా ఉండుంటే, పరిస్థితి విషమించేదని వైద్యులు చెప్తున్నారు. కాబట్టి, ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలని చెప్తున్నారు.
తాజావార్తలు
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!