పుష్ప2 రిలీజ్ డేట్ చూస్తే అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకీ ఓపెన్ ఛాలెంజ్ చేసినట్టుగానే ఉంది. ఉన్నట్టుండి 2024 ఆగష్టు 15న బాక్సాఫీస్‌ని ఏలడానికి పుష్పరాజ్ వస్తున్నాడంటూ అనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ఆగష్టు టార్గెట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని సినిమాలకు పుష్పరాజ్ షాక్ ఇచ్చినంత పని చేశాడు. ఇప్పుడు… ఆ రోజు రావాలనుకున్న సినిమాలు వెనక్కి తగ్గుతాయా? లేదంటే పుష్పరాజ్‌తో పోటీకి సై అంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఆగష్టు 15 రేసులో శంకర్ రెండు సినిమాలున్నాయి. రామ్ చరణ్‌తో చేస్తున్న ‘గేమ్ చేంజర్’, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’.. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి ఆగష్టు 15న రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని గట్టిగా వినిపించింది.
Read Also: Nandamuri Balakrishna: నేనున్నాను.. నేను వస్తున్నాను..!
ముఖ్యంగా గేమ్ చేంజర్ దాదాపుగా ఆగష్టులోనే రిలీజ్ కానుందని అన్నారు. లేదంటే.. ఇండియన్ 2 రావడం పక్కా అంటున్నారు కానీ ఇప్పుడు పుష్పరాజ్ ఆ డేట్‌ను కబ్జా చేసుకున్నాడు. దీంతో పుష్పరాజ్‌తో ఈ రెండు సినిమాల్లో ఏది పోటీకి దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది. దాదాపుగా ఇండియన్ 2, పుష్పరాజ్‌తో ఢీ కొట్టడానికి వస్తున్నాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ నటిస్తున్న Singham Again, పుష్ప2తో పోటీ పడబోతోంది. అయితే పుష్ప2, ఇండియన్ 2, Singham Again సినిమాలను తీసుకుంటే… ఈ మూడింట్లో పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు బన్నీతో పోటీకి వస్తాయని ఖచ్చితంగా చెప్పలేం. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే… ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.