హృతిక్ రోషన్ ఇంటెన్స్ లుక్… ‘విక్రమ్ వేద’ ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నెక్స్ట్ మూవీ ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ పై ఇప్పుడు ఆయన అభిమానుల దృష్టి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టార్ కాస్ట్ ఇప్పటికే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న సాయంత్రం మేకర్స్ హృతిక్ పుట్టిన రోజున ఈ చిత్రంలో వేదగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. అన్నట్టుగానే తాజాగా ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ నుంచి హృతిక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ లో హృతిక్ రోషన్ డాషింగ్‌గా కనిపిస్తున్నాడు. ఆయన రఫ్ అండ్ టఫ్ లుక్ అట్ట్రాక్టీవ్ గా ఉంది. గడ్డంతో కన్పిస్తున్న వేద నల్ల కళ్లద్దాలతో, నల్లటి కుర్తాలో రక్తంతో తడిసిన అతడిని చూస్తుంటే ఒరిజినల్ లాగానే ఈ యాక్షన్ మూవీ కూడా చూడొచ్చని అనిపిస్తోంది. ‘విక్రమ్ వేద’ ఒరిజినల్ వెర్షన్‌లో వేద పాత్రను విజయ్ సేతుపతి పోషించారు. హృతిక్ లుక్ అతనిని గుర్తుకు తెచ్చింది. కానీ హృతిక్ ఈ లుక్‌లో తనదైన స్టైల్ లో భిన్నంగా, ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు.
Read Also : నటిపై అత్యాచారం కేసులో బెదిరింపులు… మళ్ళీ కష్టాల్లో పడ్డ స్టార్ హీరో
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించిన ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్. ఒరిజినల్‌లో విక్రమ్ పాత్రలో ఆర్ మాధవన్, వేద పాత్రలో విజయ్ సేతుపతి కనిపించారు. ఒరిజినల్‌ను రూపొందించిన దర్శకుడు పుష్కర్ గాయత్రి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. సైఫ్ ఫస్ట్ లుక్ ఇంకా రాలేదు. ఇందులో రాధికా ఆప్టే కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ రోజు హృతిక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ట్రీట్ గా వేదను పరిచయం చేశారు మేకర్స్.
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!