O.M Movie Review: ఓం మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు
- DIRECTOR: దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి
- MUSIC: సంగీతం: సాయి అభయంకర్
- PRODUCER: నిర్మాత : ధనుష్
O.M Movie Review: అమరన్ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు సంపాదించిన రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ హీరోగా సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మమ్ముట్టి, సాయి పల్లవి సహా నసీరుద్దీన్ షా వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆ అంచనాలు రెట్టింపవుతూ వచ్చాయి. ఇక సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కౌట్ కావడంతో, ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. మరి ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తెలుగులో ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత జరిగే పరిణామాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఎర్రచందనం అక్రమ రవాణా సామ్రాజ్యాన్ని నడుపుతున్న అబ్దుల్ హమీద్ (నసీరుద్దీన్ షా) నెట్‌వర్క్‌ను కూల్చివేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెడ్ నిత్యా రెడ్డి (సాయి పల్లవి) రంగంలోకి దిగుతుంది. హమీద్‌ను పట్టుకోవాలంటే, తమిళనాడులోని రెడ్ హిల్స్ కేంద్రంగా చక్రం తిప్పుతున్న బర్మా కార్తికేయన్ అలియాస్ సియా (మమ్ముట్టి) ఆట కట్టించాల్సి ఉంటుంది. ఇందుకోసం పళని (ధనుష్) అనే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ ను ఒక రహస్య ఆపరేషన్ కోసం ఎంపిక చేస్తుంది నిత్యా రెడ్డి. తిరుకుమరన్ అనే ఫోటోగ్రాఫర్‌గా మారువేషంలో సియా కోటలోకి అడుగుపెట్టిన పళని, అనతికాలంలోనే అతని నమ్మకాన్ని గెలుచుకుంటాడు. అయితే ఆపరేషన్ ముందుకు సాగుతున్న కొద్దీ ఊహించని నిజాలు, వ్యక్తిగత నష్టాలు ఎదురవుతాయి. విధి నిర్వహణకు, త్యాగాలకు మధ్య జరిగే ఈ సంఘర్షణలో పళని తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? ఈ కథలో కడప గోవర్ధన్ రెడ్డి(బ్రహ్మాజీ), షణ్ముగం(ఇంద్రాన్స్), రోజా (సాయి పల్లవి) పాత్రలు ఏమిటి? అసలు ఆపరేషన్ మోల్ ఏ మలుపులు తిరిగింది? అనేదే మిగిలిన కథ.
Also Read
- Ramayana vs Dangal: 2 వేల కోట్లకు చేరువలో ‘రామాయణ’.. ‘దంగల్’ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా..!
- Satvika Veeravalli: ఒకవైపు డెబ్యూ మూవీ రిలీజ్.. మరోవైపు నాగచైతన్య సినిమాలో ఫిక్స్! అసలు ఎవరీ లక్కీ హీరోయిన్?
- Rajkumar Periasamy: ‘ఓం’ సినిమాలో ఆ సందేశం ఉండదు.. రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌కుమార్!
- Dulquer Salmaan: దుల్కర్ సడెన్ సర్ప్రైజ్.. కొత్త సినిమా టైటిల్ ఇదేనట!
విశ్లేషణ:
సాధారణంగా స్పై థ్రిల్లర్స్ అంటే వేగవంతమైన స్క్రీన్‌ప్లే, అడుగడుగునా ట్విస్టులతో సాగుతుంటాయి. కానీ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ కథను చాలా వాస్తవికంగా, మనుషుల భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా వల్ల గిరిజన తెగలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారిని రోజువారీ కూలీలుగా మార్చిన తీరును సినిమా ప్రారంభంలోనే కళ్లకు కట్టినట్లు చూపించారు. సినిమా మొదటి భాగం చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. పాత్రల పరిచయం, అండర్ కవర్ ఆపరేషన్ మొదలయ్యే తీరు ప్రేక్షకులను కథలో లీనం చేస్తాయి. అనవసరపు హీరోయిజం, ఎలివేషన్ల జోలికి వెళ్లకుండా కథకు ఏం అవసరమో దాన్నే చూపించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌ను కేవలం ట్విస్టుల మీద కాకుండా, బలమైన ఎమోషన్స్‌తో డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే ఎంతో ఆసక్తికరంగా సాగిన ప్రథమార్థం తర్వాత, ద్వితీయార్థంలో కథనం ఒక్కసారిగా నెమ్మదించింది. థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన వేగం, ఉత్కంఠ సెకండ్ హాఫ్‌లో లోపించాయి. సన్నివేశాల ద్వారా కథను చెప్పడం కంటే, సంభాషణల ద్వారా ఎక్కువ వివరణ ఇవ్వడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కథనం రొటీన్ ఫార్మాట్లోకి వెళ్లడంతో తర్వాతి మలుపులను సులభంగా ఊహించవచ్చు. క్లైమాక్స్ కూడా మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. ముగింపు హఠాత్తుగా ఆపేసినట్లు ఉండటం ఏదో తింటున్న భోజనాన్ని పక్కకి లాగేసిన ఫీలింగ్ కలిగిస్తుంది. బలమైన నటీనటుల అభినయం, ఆకట్టుకునే నేపథ్య సంగీతం, వాస్తవికతకు దగ్గరగా సాగే కథనం ‘ఓ.ఎమ్: ఆపరేషన్ మోల్’ చిత్రానికి ప్రధాన బలాలు. అయితే నెమ్మదించిన సెకండ్ హాఫ్, సాగదీసిన క్లైమాక్స్ ఈ థ్రిల్లర్ స్థాయిని కొంత తగ్గించాయి. వేగవంతమైన కమర్షియల్ యాక్షన్ సినిమాలు కాకుండా, నెమ్మదిగా సాగే ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. థియేటర్లలో ఒకసారి చూడొచ్చు.
నటీనటుల పనితీరు విషయానికి వస్తేఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సాయి పల్లవి. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ నిత్యా రెడ్డి పాత్రలో ఆమె నటన అద్భుతం. తన కెరీర్లో ఇప్పటివరకు చేయని ఒక కొత్త కోణాన్ని ఆమె ఇందులో చూపించారు. అదేవిధంగా పళని పాత్రలో ధనుష్ తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. ఎక్కడా అతి లేకుండా, పాత్రలోని అంతర్మథనాన్ని కళ్లతోనే పలికించారు. అంతేకాక సియా పాత్రకు మమ్ముట్టి తన గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రాణం పోశారు. అయితే ఆయన స్థాయి నటుడికి కథలో ఇంకాస్త బలమైన స్కోప్ ఇచ్చి ఉంటే బాగుండేది. ధనుష్ తండ్రి పాత్రలో ఇంద్రన్స్ నటన హృదయాన్ని హత్తుకుంటుంది. ఇంటర్వెల్ సన్నివేశాల్లో ఆయన పాత్ర కీలకంగా నిలుస్తుంది. శ్రీలీల కనిపించేది కాసేపే అయినా పర్వాలేదనిపిస్తుంది, నసీరుద్దీన్ షా వంటి గొప్ప నటుడిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. ఇక మిగతా వాళ్ళందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద బలం. సన్నివేశాల్లో వేగం తగ్గిన చోట కూడా తన బీజీఎమ్‌తో ఉత్కంఠను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఎర్రచందనం అడవుల నేపథ్యాన్ని, అక్కడి కఠిన పరిస్థితులను కెమెరామెన్ చాలా సహజంగా బంధించారు. ప్రారంభంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ చాలా రా అండ్ రస్టిక్‌గా సాగుతూ సినిమా మూడ్‌ను సెట్ చేస్తుంది. కలైవానన్ ఎడిటింగ్ ప్రథమార్థంలో బాగున్నా, సెకండ్ హాఫ్ నిడివిని తగ్గించడంలో విఫలమయ్యారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఎంచుకున్న పాయింట్, చేసిన రీసెర్చ్ బాగున్నప్పటికీ, ద్వితీయార్థం స్క్రీన్‌ప్లేపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది.
ఫైనల్లీ ఓం పెర్ఫార్మెన్స్ పీక్స్.. కథ రొటీన్
తాజావార్తలు
-
Chanakya Niti: ఈ 5 రకాల మనుషులతో జాగ్రత్త.. చాణక్య నీతి హెచ్చరిక..
-
Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
-
Kantar BrandZ 2026: ఎయిర్టెల్ నంబర్ 1.. మరి జియో ఎక్కడ? కాంతార్ 2026 ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర ట్విస్ట్!
-
Ramayana vs Dangal: 2 వేల కోట్లకు చేరువలో ‘రామాయణ’.. ‘దంగల్’ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా..!
-
Supreme Court: కావేరీ జలాల వివాదంలో తమిళనాడుకు భారీ ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!