నటిపై అత్యాచారం కేసులో బెదిరింపులు… మళ్ళీ కష్టాల్లో పడ్డ స్టార్ హీరో

ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ లైంగిక వేధింపుల కేసులో చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. కేరళ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై కొత్త కేసు నమోదు చేసింది. సమాచారం ప్రకారం దిలీప్, మిగిలిన 5 మంది విచారణ అధికారులను బెదిరించారట. దర్శకుడు బాలచంద్రకుమార్‌ వెల్లడించగా ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also : స్టుపిడ్స్… నెటిజన్ కు హరీష్ శంకర్ స్ట్రాంగ్ రిప్లై

ఇటీవల దర్శకుడు బాలచంద్ర కుమార్ 2017 నటిపై దాడి కేసులో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆయన ఈ సంచలన ప్రకటన చేసిన తర్వాత పలు ఆడియో క్లిప్‌లు బయటపడ్డాయి. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను దిలీప్, ఆయన బృందం బెదిరించినట్లు ఆడియో క్లిప్‌ల ద్వారా బహిర్గతం అవుతోంది. కుట్ర, బెదిరింపులకు పాల్పడినందుకు గాను దిలీప్‌తో పాటు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మలయాళ నటుడు దిలీప్ కుమార్ మొదటి నిందితుడు. ఆయన సోదరుడు అనూప్, బావమరిది వరుసగా రెండవ (A2), మూడవ (A3) నిందితులుగా ఉన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో బాబు చెమంగనాడ్, అప్పు అనే గుర్తు తెలియని వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. దర్శకుడు బాలచంద్ర కుమార్ స్టేట్మెంట్ ప్రకారం దిలీప్ తో పాటు ఆ వ్యక్తులు దర్యాప్తు అధికారుల ప్రాణాలకు హాని కలిగించడానికి ప్రయత్నించారు.

Read Also : మ్యూజికల్ నైట్ లో హీరోయిన్ తో కలిసి దుమ్మురేపిన నాగ్, చై

2017లో ఒక ప్రముఖ మలయాళ నటిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో దిలీప్ కుమార్ పేరు బయటకు రావడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఈ కేసులో దిలీప్ కుమార్ కొన్ని వారాల పాటు జైల్లో ఉన్నాడు. ఐదేళ్లుగా కేసు నడుస్తోంది. జనవరి 5న దిలీప్ కస్టడీని మరో ఆరు నెలలు పొడిగించాలని కోరుతూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా పరిణామాలతో ఇప్పుడు మళ్ళీ కష్టాల్లో పడుతున్న దిలీప్ కుమార్ మరోసారి కస్టడీలోకి వెళ్తాడా ? అనేది చూడాలి.

Related Articles

Latest Articles