Hrithik – NTR to Dance for War 2: హృతిక్ రోషన్ హీరోగా టైగర్ ష్రాఫ్ మరో కీలక పాత్రలో తెరకెక్కిన వార్ సినిమా సూపర్ హిట్గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించినప్పుడు జనాల్లో పెద్దగా ఆసక్తి లేదు. కానీ ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలకపాత్రలో నటిస్తున్నాడని ప్రకటన వచ్చినప్పటి నుంచి ఒక్కసారిగా అందరికీ ఈ సినిమా మీద ఆసక్తి పెరిగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా కొంత పూర్తయింది. జూనియర్ ఎన్టీఆర్ డూప్ న పెట్టి కొన్ని సీన్స్ షూట్ చేశారనే ప్రచారం కూడా ఉంది. ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన గాసిప్ బాలీవుడ్ మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
OTT Releases Movies : ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..
అదేంటంటే ఈ సినిమాలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సాంగ్ చేస్తున్నారని. ఇద్దరు అద్భుతమైన డాన్సర్లు దొరకడంతో నాటు నాటు సాంగ్ కి మించి ఉండేలా ఒక సాంగ్ రెడీ చేసుకుంటున్నారని చెబుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేసిన నాటు నాటు సాంగ్ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఈ సినిమాని మరింత ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఈ పాట బాగా ఉపయోగపడింది. ఆ పాటను మించి ఉండేలాగా ఒక మంచి సాంగ్ డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. యాష్ రాజ్ స్పై ఫిలిం యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఒక సౌత్ స్టార్, ఒక నార్త్ స్టార్ తో కలిసి చేసిన సినిమాలు గతంలో ఉన్నా సరే ఈ సినిమా సీక్వెల్ కావడంతో మొదటి సినిమాకి ఉన్న అంచనాలు కూడా ఈ సినిమాకి యాడ్ అవుతున్నాయి.