అక్కినేని నట వారసుడు నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న థాంక్యూ విడుదలకు సిద్ధమవుతుండగా.. మరో మూడు ప్రాజెక్ట్ లు లైన్లో ఉన్నాయి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. గత కొన్ని రోజుల నుంచి చైతూ, నటి శోభితా ధూళిపాళ్ల తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సమంత తో చై విడాకులు తీసుకున్నాక కెరీర్ పై ఫోకస్ పెట్టిన చై.. ఈ మధ్య శోభితా తో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలపై చైతూ మాజీ భార్య సమంత కూడా స్పందించింది కానీ అక్కినేని నవ మన్మధుడు మాత్రం మాట మాత్రం కూడా పలుకలేదు. సాధారణంగా చైతూ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఈ విషయం అందరికి తెలిసిందే.
సమంత తో విడిపోయాకా అభిమానులు వంద ప్రశ్నలు అడిగినా, మీడియా సమాధానం ఇవ్వమని కోరినా కూడా చైతూ మౌనమే సమాధానం అని చెప్పకనే చెప్పాడు. ఆ సమయంలోనే బంగార్రాజు విడుదలైంది. మీడియా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. అయితే అప్పుడు కూడా సామ్ గురించిన ప్రశ్నలు మాత్రం అడగకూడదని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి మరీ ప్రమోషన్స్ చేయించుకున్నాడు. కానీ, ఎక్కడో ఒక చోట ఈ ప్రశ్న రావడం తప్పక చైతూ .. అది మా వ్యక్తిగత విషయం.. ఇద్దరం పరస్పరం మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నాం.. అని చెప్పుకొచ్చాడు.
ఇక ఆ తరువాత దాని గురించి స్పందించింది లేదు. ఇక ఇప్పుడు శోభితా విషయం లో కూడా చై అదే పద్దతిని పాటిస్తున్నాడు. ఇప్పటివరకు మౌనంగా ఉన్న చైతూ నోరు విప్పాల్సిన సమయం వచ్చేసింది. జూలై 8 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసమైనా చైతన్య మీడియా ముందుకు రావాల్సి ఉంది. ఇక ఈ హీరో కనిపిసితె ఖచ్చితంగా శోభితా విషయం గురించి అడుగగా మానరు. మరి ఆ సమయంలో చైతూ ఎలాంటి సమాధానం చెప్తాడో అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక యువసామ్రాట్, శోభితా మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది తెలియాలంటే మరికొద్దిరోజుల్లో ఆగాల్సిందే.