సౌత్ ఇండియాలో కూడా సరిగ్గా రికగ్నైజేషణ్ లేని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియాలోని ప్రతి కార్నర్ కి పరిచయం చేసింది ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్. KGF చాప్టర్ 1మ్ KGF చాప్టర్ 2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన హోంబలే ఫిల్మ్స్, లేటెస్ట్ గా కాంతార సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ అండ్ ట్రేడ్ వర్గాల ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం హోంబలే ఫిల్మ్స్ నుంచి ఏ సినిమా వచ్చినా అది పాన్ ఇండియా హిట్ అవుతుంది అనే నమ్మకంలో ఉన్నారు. ఈ నమ్మకాన్ని మరింత పెంచుతూ హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్ తో ‘సలార్’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అయ్యే లోపు మరో సినిమాని అనౌన్స్ చేశారు హోంబలే. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గ్రాండ్ సన్ అయిన ‘యువ రాజ్ కుమార్’ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ హోంబలే ఫిల్మ్స్ ‘యువ’ అనే సినిమాని అనౌన్స్ చేసింది. పునీత్ రాజ్ కుమార్ కి సూపర్ హిట్స్, యష్ ని సూపర్ స్టార్ ని చేసిన రైటర్-డైరెక్టర్ సంతోష్ ఆనంద్ దర్శకత్వంలో ‘యువ’ సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో యువ రాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. టైటిల్ టీజర్ కి అజ్నీష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రెమండస్ గా ఉంది. అయితే ఈ టైటిల్ టీజర్ మేకింగ్ అండ్ సౌండ్ డిజైన్ చూస్తుంటే KGF సినిమానే గుర్తొస్తుంది. KGF స్టైల్ లోనే హోంబలే ఫిల్మ్స్ సినిమాలు చెయ్యడానికి ముందుకి వస్తుందో లేక వాళ్ల దగ్గరికి ఇలాంటి కథలే వెళ్తూన్నాయో తెలియదు కానీ ఒకే స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉన్న సినిమాలు ఎక్కువగా రావడం ప్రేక్షకులని విసిగించే విషయమే. దీన్ని హోంబలే ఫిల్మ్స్ వీలైనంత త్వరగా అర్ధం చేసుకుంటే మంచింది, లేదంటే భారి నష్టాలని ఫేస్ చెయ్యాల్సి వస్తుంది. దీంతో పాటు బ్రాండ్ వేల్యూ కూడా తగ్గుతుంది.
ಯುವ ಪರ್ವ ಆರಂಭ, 𝐓𝐇𝐄 𝐑𝐀𝐆𝐄 𝐁𝐄𝐆𝐈𝐍𝐒 💥 #Yuva Title Teaser: https://t.co/fJ8dNFZkIi@SanthoshAnand15 #VijayKiragandur @hombalefilms @HombaleGroup @AJANEESHB @DopShreesha @prakashraaj @yuvathefilm #YuvaOnDec22 pic.twitter.com/xNeQaSRGql
— YuvaRajkumar (@yuva_rajkumar) March 3, 2023