యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటించబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్ 30’. వర్కింగ్ టైటిల్ తోనే ముహూర్త కార్యక్రమం జరుపుకున్న ఈ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో అనౌన్స్మెంట్ తోనే ఈ ప్రాజెక్ట్ పై భారి అంచనాలు ఏర్పడ్డాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతుంది. మార్చ్ 30 నుంచి రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లనున్న ఎన్టీఆర్ 30 సినిమాలో హ్యుజ్ వాటర్ సీక్వెన్స్ లు ఉన్నాయి, వాటిని రియల్ ఫుటేజ్ అండ్ విజువల్స్ ఎఫెక్ట్స్ ని మిక్స్ చేస్తూ డిజైన్ చేస్తున్నాం అని ఇటివలే కెమెరామాన్ రత్నవేలు తెలిపాడు. సముద్ర తీరంలో భారి యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమా షూట్ చెయ్యాలి అంటే అంత మంచి టెక్నిషియన్స్ ఉండాలి, ఈ విషయం బాగా తెలిసిన కొరటాల శివ ఎన్టీఆర్ 30 లోని ఫైట్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ని రంగంలోకి దించాడు. మిషన్ ఇంపాజిబుల్-ఘోస్ట్ ప్రోటోకాల్, ట్రాన్స్ఫార్మర్స్, రష్ అవర్ 3, ది ఫాస్ట్ అండ్ ఫ్యురియస్, అర్మాగేడ్డాన్, ది మాస్క్ లాంట హాలీవుడ్ సినిమాలకి యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసిన కేన్నీ బేట్స్ ని ఎన్టీఆర్ 30 కోసం లాక్ చేశారు.
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా సాహో కూడా కేన్నీ బేట్స్ స్టంట్ మాస్టర్ గా వర్క్ చేసాడు. ఈ మూవీలోని ఫైట్ సీక్వెన్స్ లు ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకూ చూడని విధంగా ఉంటాయి. ఆ రేంజ్ ఫైట్స్ ని కంపోజ్ చేసిన కేన్నీ బేట్స్ రావడంతో ఎన్టీఆర్ 30 సినిమాపై అంచనాలని మరింత పెంచేలా చేసింది. కేన్నీ బేట్స్ ఎన్టీఆర్ 30 సినిమాలో జాయిన్ అవుతున్నాడు అనే విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక ఫోటోని రిలీజ్ చేశారు. ఇందులో కొరటాల శివ, సాబు సిరిల్, కేన్నీ బేట్స్, రత్నవేలు ఉన్నారు. ఒక ప్రోటోటైప్ షిప్ ని డిజైన్ చేసి దానిపై కంటేనర్స్ పెట్టి యూనిట్ అంతా ఎదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. ఈ ఫోటోలోని షిప్ సెటప్ ని చూస్తూ ఉంటే కొరటాల శివ ఎదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. మరి ఎన్టీఆర్ తో కొరటాల శివ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Renowned Action Producer #KennyBates joins the team of #NTR30 & is choreographing major action sequences 🔥
Conceptualization in progess!@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @sabucyril @RathnaveluDop @YuvasudhaArts pic.twitter.com/IfvrNB9v2a
— NTR Arts (@NTRArtsOfficial) March 25, 2023