Hit 3: శైలేష్ కొలను.. హిట్ సిరీస్ ను మల్టివర్స్ గా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. విశ్వక్ సేన్ తో హిట్ ను ప్రారంభించి తెలంగాణ లో మొదటి కేసును సాల్వ్ చేసి హిట్ అందుకున్నాడు. ఇక దీనికి కంటిన్యూగా అడివి శేష్ తో హిట్ 2 ను ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ లో రెండో కేసును సాల్వ్ చేయనున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని ఈ సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక హిట్ 2 ఇంకా రిలీజ్ కూడా కాలేదు. అప్పుడే హిట్ 3 గురించి చర్చ మొదలైపోయింది. హిట్ 3 లో ముగ్గురు మొనగాళ్లను దింపబోతున్నాడట శైలేష్.. మల్టివర్స్ కాబట్టి మొదటి హీరో విశ్వక్ సేన్.. హిట్ 2 లో కూడా కనిపించనున్నాడని ఆల్రెడీ చెప్పేశారు.
ఇక హిట్ 2 నుంచి హిట్ 3 లో అడివి శేష్ ఎలాగో ఉంటాడు. ఈ హీరోతో పాటు మరి ఇద్దరు స్టార్స్ కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. వారెవరో కాదు నాని, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. అయితే ఎవరు హీరోలు..? ఎవరు విలన్స్ అనేది మాత్రం సస్పెన్స్. ఇప్పటికే హిట్ 3 కథను కూడా శైలేష్ రాసేసుకున్నాడట. తెలంగాణ, ఆంధ్రా అయిపోగా మూడో పార్ట్ కోసం విదేశాలకు బయల్దేరనున్నారట. ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ వార్తపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. హిట్ 2 నే ఇంకా హిట్ కొట్టలేదు అప్పుడే హిట్ 3 నా..? అని కొందరు అంటుండగా.. అడవి శేష్ ఈ హిట్ తోనే సరిపెడతాడా..? గూఢచారి 2 ను పట్టాలెక్కిస్తాడా..? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.