‘కంచె’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్… ఈ చిత్రం తరువాత అమ్మడికి అవకాశాలు వచ్చాయి కానీ విజయాలు మాత్రం అందలేదు. ఇప్పటివరకు కుర్ర హీరోల సరసన నటించిన ఈ భామ మొదటి సారి స్టార్ హీరో సరసన నటిస్తోంది. ‘అఖండ’ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా ఆడిపాడనుంది. భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ హాట్ భామ ఆశలన్నీ అఖండ పైనే పెట్టుకొంది. డిసెంబర్ 2 న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న బ్యూటీ బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది.
‘అఖండ’ షూటింగ్ చాలా సరదాగా గడిచిపోయిందని చెప్పిన ముద్దుగుమ్మ.. బాలకృష్ణ పాత్ర గురించి తనెక్కడ వినలేదని చెప్పుకొచ్చింది. ” నేను ఏ భాషలోనూ ఇలాంటి పాత్రను చూడలేదు.. అసలు బాలకృష్ణ గారిని సెట్ లో చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన టైమ్ అంటే టైమే.. ఉదయం మూడు గంటలకు లేస్తారు.. ఆరు గంటలకు షూటింగ్ కి వస్తారు.. రోజంతా షూటింగ్ చేసినా అస్సలు అలసిపోరు.. ఒకరోజు ఆయన ముందే మీరు అసలు మనిషేనా ..? అని అడిగేశాను” అని చెప్పుకొచ్చింది. బోయపాటి గురించి మాట్లాడుతూ ” ఆయన కథను నమ్మి సినిమా తీస్తారు .. ఇలాంటి పవర్ ఫుల్ పాత్రకు బాలకృష్ణ గారే కరెక్ట్ అని నమ్మారు.. ఈ చిత్రంలో నాది కూడా ఒక కీలక పాత్ర .. అందరికి నచ్చుతోంది” అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమాతో అమ్మడి అదృష్టం మారుతుందేమో చూడాలి.