గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి తెలుగు తెరపై మెరిసింది ‘డింపుల్ హయతి’. తన డాన్స్ అండ్ గ్లామర్ తో స్పెషల్ సాంగ్ తోనే యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ తెలుగు అమ్మాయి… అక్కడి నుంచి వెంటనే హీరోయిన్ అయిపొయింది. స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్లు హీరోయిన్ అవ్వాలి అంటే చాలా టైమ్ పడుతుంది కానీ డింపుల్ చాలా త్వరగా హీరోయిన్ ట్రాక్ ఎక్కేసింది. ఖిలాడీ, రామబాణం లాంటి సినిమాల్లో డింపుల్ బాగానే కనిపించింది కానీ ఆశించిన స్థాయి హిట్ మాత్రం రాలేదు. కెరీర్ ని టర్న్ చేసే సినిమా కోసం వెయిట్ చేస్తున్న డింపుల్ కి ఊహించని పరిస్థితి ఎదురయ్యింది. డింపుల్ హయతికి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకి మధ్య జరిగిన ఇష్యూ చాలా దూరం వెళ్లింది. డింపుల్ పైన కేసు ఫైల్ చెయ్యడం, మీడియా మొత్తం డింపుల్ వైపు చూడడం… ఇది జరిగినప్పటి నుంచి డింపుల్ హయతి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.
తనపై కేసు ఫైల్ అవ్వగానే “అధికారాన్ని అడ్డం పెట్టుకోని తప్పులని కప్పి పుచ్చుకోలేరు” అనే ట్వీట్ చేసిన డింపుల్ హయతి, లేటెస్ట్ గా బాలయ్య డైలాగ్ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసింది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘సింహ’. ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చిన బాలయ్య, చలపతి రావుతో పోలీస్ స్టేషన్ లో “నో పోలీస్… అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది ఏం” అనే సూపర్ డైలాగ్ చెప్తాడు. థియేటర్స్ లో ఫాన్స్ తో విజిల్స్ వేయించిన ఈ డైలాగ్ ని డింపుల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇది ఎవరికి కౌంటర్ అనేది డింపుల్ మెన్షన్ చేయక పోయినా… తను పెట్టిన ఫైర్ సింబల్ ని బట్టి చూస్తే డింపుల్ డైలాగ్ ఎవరికీ అర్థమైపోతుంది. ఇంతకీ అసలు ఈ గొడవకి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి.
— Dimple Hayathi (@DimpleHayathi) May 27, 2023