Vishwak Sen: మన సినిమా బావుందని ఎవరినో కించపరచవద్దు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా విశ్వక్ సేన్ ‘బేబీ’ సినిమాలో నటించలేదు, కథ చెప్పే టైం కూడా ఇవ్వలేదు అనే మీమ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దర్శకుడు రాజేష్ బేబీ సినిమాని ముందుగా విశ్వక్ సేన్ కి చెప్పాలి అనుకున్నాడు కానీ విశ్వక్ కథ కూడా వినలేదట. ఇప్పుడు బేబీ సూపర్ హిట్ అయిన తర్వాత విశ్వక్ సేన్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ వేస్తూ విశ్వక్ సేన్ ‘పేక మేడలు’ టీజర్ లాంచ్ లో మాట్లాడాడు.
విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘‘రాకేశ్ య్టాకర్‌గా నటిస్తూనే నిర్మాతగా కూడా మారడం ఆనందంగా ఉంది. ఆ ప్లెజర్ చాలా ఆనందంగా ఉంటుంది. మన సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు. ఈ చిత్రం హీరో వినోద్ కళ్లతో నటిస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ అద్భుతంగా ఉంది. రాకేశ్‌కు ఆల్ ద బెస్ట్. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. ఇక చిత్రాల గురించి వస్తే… నా రెండు చిత్రాల గురించి వచ్చేవారం నుంచి అప్‌డేట్స్ ఇస్తా. వాటితో పాటు ఓ సర్‌ప్రైజ్ కూడా ఇస్తాను. ముఖ్యంగా ఈ వేదికగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా” అని చెప్పిన విశ్వక్ సేన్ ‘బేబీ’ సినిమా ఇష్యూని కూడా ఇన్ డైరెక్ట్ గా అడ్రెస్ చేస్తూ…
Also Read
- Shwetha Menon: మలయాళ 'అమ్మ'లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా!
- Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ను కలిసిన ప్రియదర్శి మూవీ టీమ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
- Sai Durga Tej: ‘మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది’.. హనుమాన్ 3Dపై సుప్రీం హీరో క్రేజీ రివ్యూ!
- OG 2: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. స్టార్ట్ అయిన ‘OG 2’ స్క్రిప్ట్ డిస్కషన్స్!
“నాలాంటి వాళ్లు చిన్న హీరో అయినా చేస్తున్న పనిలో బిజీతో కొన్ని సందర్భాల్లో ఎవరికీ టైమ్ ఇవ్వలేము. కథలు వినలేము. తెలుగులో ఏ సినిమా హిట్ అయినా ఎక్కువశాతం ఆనందించేవాళ్లు ఉంటారు. ఏడ్చేవాళ్లు చాలా తక్కువ ఉంటారు. ఇటీవల నాపై కొన్ని మీమ్స్ వచ్చాయి. కథ చెబుతానంటే టైమ్ ఇవ్వలేదు… వినలేదు అని. గంట సేపు ఓ మనిషికి కూర్చోబెట్టి తిరస్కరించడం ఇష్టం లేక నా నోటి నుంచి వచ్చిన జవాబు అది. చిన్న సినిమాగా మొదలన ఆ చిత్రం పెద్ద హిట్ అయితే ఆనందించారు. డైరెక్టర్స్ గ్రూప్‌లో ఆ చిత్రం ట్రైలర్ రాగానే బావుందని మొదటి స్పందించింది నేనే’. ఆ చిత్రం నేను చేయాలి కానీ కుదరలేదు. మన సినిమా బావుంటే తల ఎత్తుకునేలా ఉండాలి. మన సినిమా బావుందని ఎవరినో కించపరచవద్దు. అదొకటి నాకు బాధ అనిపించింది’’ అని అన్నారు. మరి విశ్వక్ సేన్ ఇచ్చిన ఇన్ డైరెక్ట్ ఆన్సర్ తో బేబీ డైరెక్టర్ రాజేష్ కాస్త శాంతిస్తాడా లేక ఇష్యూని కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!