Rashmi: యాంకర్ రష్మీ ప్రస్తుతం షోలతో పాటు సినిమాల్లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. గీతా మాధురి భర్త నందు హీరోగా రాజ్ విరాఠ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో రిలీజ్ కు సిద్దమైన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాను నవంబర్ 4 న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్.. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ క్రమంలోనే యంగ్ హీరో నందు, రష్మీపై ఫైర్ అవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటికి నిన్న నందు ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో రష్మీ ప్రమోషన్స్ కు రమ్మంటే రావడం లేదని, తమ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని, పొగరు చూపిస్తుందని చెప్పుకొచ్చాడు. అందుకే సీక్రెట్ గా ఆమె ఫోటోషూట్ జరుగుతున్న ప్లేస్ కు వచ్చి ఆమెను కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. ఇక రష్మీని కలిసిన నందు ప్రమోషన్స్ కు ఎందుకు రావు అని అడుగగా.. నేను ప్రమోషన్స్ చేయను.. మంచి క్యాస్టింగ్ ఉందా..? సినిమా కథ ఎలాంటిది..? ఇలాంటివన్నీ అడుగుతారు.. నేను రాలేను అని చెప్పుకొచ్చింది. అందుకు నందు నువ్వు చెప్పినవన్నీ మన సినిమాలో ఉన్నాయి.. ప్రమోషన్స్ చేసుకుందాం రా అని వీడియో చివర్లో ఇది ప్రాంక్ అని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రమోషన్స్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయాలా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.