మ్యాచో స్టార్ గోపీచంద్ తన కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం గోపీచంద్ తనకి టైలేర్ మేడ్ లాంటి కమర్షియల్ జానర్ లో రామబాణం సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వకముందే తన నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టిన గోపీచంద్, ఈరోజే పూజా కార్యక్రమాలని పూర్తి చేశాడు. తన 25వ సినిమా ‘పంతం’ని ప్రొడ్యూస్ చేసిన శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లోనే గోపీచంద్ తన 31వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని కన్నడ దర్శకుడు హర్ష డైరెక్ట్ చేస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసిన హర్ష, KFIలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. శివన్నతో ‘భజరంగీ’, ‘భజరంగీ 2’, ‘వజ్రకాయ’ లాంటి సినిమాలు చేసిన హర్ష, ఇటివలే ‘వేద’ సినిమాతో మరో హిట్ కొట్టాడు.
Read Also: Manchu Manoj: నేడు మౌనికారెడ్డితో మంచు మనోజ్ వివాహం…
పునీత్ రాజ్ కుమార్ తో కూడా ‘అంజనీపుత్ర’ సినిమా చేసిన హర్ష, మాస్ సినిమాలని పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తాడనే పేరుంది. గోపీచంద్ కి ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో హర్ష, గోపీచంద్ కలిసి ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని ఆడియన్స్ కి ఇస్తారేమో చూడాలి. ఈ మాస్ కాంబినేషన్ ని మరింతగా ఎలివేట్ చెయ్యడానికి మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ రంగంలోకి దిగాడు. ఉగ్రం, KGF, సలార్ లాంటి భారి సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన రవి బసూర్, గోపీచంద్ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తుండడం విశేషం. మరి ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్న గోపీచంద్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.