లోకనాయకుడు కమల్ హాసన్ ని ఏజెంట్ విక్రమ్ గా చూపిస్తూ లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఈ మూవీ కమల్ కెరీర్ కే కాదు కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. విక్రమ్ సినిమాకి ఖైదీకి లింక్ చేసి లోకేష్ చేసిన మ్యాజిక్, బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పుట్టి, కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కి పరిచయం చేసింది. కమల్ హాసన్, ఫాహద్ ఫజిల్, విజయ్ సేతుపతిల యాక్టింగ్ బ్రిలియన్స్… లోకేష్ కనగరాజ్ మేకింగ్ స్టాండర్డ్స్ కలిసిన విక్రమ్ సినిమా ఆడియన్స్ కి అవుట్ స్టాండింగ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. వీళ్లకి తోడు విక్రమ్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచాడు సూర్య. విక్రమ్ క్లైమాక్స్ లో రోలెక్స్ గా క్యామియో ప్లే చేసిన సూర్య, ఆ కాసేపు టెర్రిఫిక్ గా కనిపించాడు.
విక్రమ్ సినిమా కలెక్షన్స్ లో సగం సూర్య క్యామియోకి ఇచ్చేయ్యోచు. ఆ రేంజ్ ఇంపాక్ట్ ని ఇచ్చాడు సూర్య. రోలెక్స్ పాత్రని లోకేష్ ఇంట్రడ్యూస్ చేసిన విధానానికి ఆడియన్స్ థియేటర్స్ లో రచ్చ చేసారు. ఈ ఒక్క సీన్ విక్రమ్ సినిమాని ఆకాశానికి తీసుకోని పోయింది. విక్రమ్ సినిమాకి రోలెక్స్ పాత్ర ఎంత హెల్ప్ అయ్యిందో లియో సినిమాకి అంత మైనస్ అయ్యింది. లియో సినిమా చూడడానికి థియేటర్స్ కి వెళ్లిన ప్రతిఒక్కరూ రోలెక్స్ రేంజ్ క్యామియోని ఎక్స్పెక్ట్ చేసారు. సూర్య రేంజ్ స్టార్ కనిపిస్తాడనుకున్నారు. లియో సినిమా విషయంలో ఈ రెండూ జరగలేదు. లియోని LCUలోకి కలిపినా విధానం కూడా ఆడియన్స్ ని సాటిస్ఫై చెయ్యలేదు. అది కన్వీన్సింగ్ గా లింక్ చేసినా… సూర్య రేంజ్ క్యామియో ఒకటి పడినా లియో సినిమా ఈరోజు ఒక రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకునేది. అది లేకపోవడమే లియోలో బిగ్గెస్ట్ మైనస్ గా నిలిచింది.