లోకనాయకుడు కమల్ హాసన్ ని ఏజెంట్ విక్రమ్ గా చూపిస్తూ లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఈ మూవీ కమల్ కెరీర్ కే కాదు కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. విక్రమ్ సినిమాకి ఖైదీకి లింక్ చేసి లోకేష్ చేసిన మ్యాజిక్, బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పుట్టి, కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కి పరిచయం చేసింది. కమల్ హాసన్, ఫాహద్ ఫజిల్, విజయ్ సేతుపతిల…