నట సింహం, గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ పేరు వినగానే సినీ అభిమానులందరికీ వైట్ అండ్ వైట్ ఖద్దర్ వేసి, మీసం మెలితిప్పి పవర్ ఫుల్ డైలాగులు చెప్తూ, విలన్స్ ని ఇరగదీసే హీరో గుర్తొస్తాడు. ఫ్యాక్షన్ రోల్స్ బాలయ్య టైలర్ మేడ్ పాత్రల్లాంటివి. అందుకే అభిమానులకి ఫ్యాక్షన్ రోల్స్ లో బాలయ్య కనిపించగానే థియేటర్స్ లో హంగామా మొదలవుతుంది. అయితే ఫ్యాక్షన్ రోల్స్ లో మాత్రమే కాదు పోలీస్ యూనిఫామ్ వేసి కూడా బాలయ్య చాలా సినిమాలే నటించాడు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, తిరగబడ్డ తెలుగు బిడ్డ, రౌడీ ఇన్స్పెక్టర్, సీమ సింహం, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహ, రూలర్, అల్లరి పిడుగు, సుల్తాన్, మాతో పెట్టుకోకు, అశ్వమేధం సినిమాల్లో బాలయ్య యునిఫామ్ వేసి మాస్ ఆడియన్స్ ని మెప్పించాడు. ముఖ్యంగా రౌడీ ఇన్స్పెక్టర్, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహ సినిమాల్లో బాలయ్య చేసిన పోలీస్ రోల్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీ నరసింహ సినిమాలకి నందమూరి అభిమానుల్లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. చివరగా రూలర్ సినిమాలో బాలయ్య పోలీస్ పాత్రలో కనిపించాడు. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాలో బాలయ్య గెటప్ సెట్ అవ్వలేదు. ఈసారి యునిఫామ్ వేసి సాలిడ్ హిట్ కొట్టడానికి రెడీ అయిన బాలయ్య, మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి సినిమా చేస్తున్నాడు. NBK 108గా సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ టైటిల్ ని ‘భగవంత్ కేసరి’గా అనౌన్స్ చేసారు మేకర్స్. తెలంగాణ యాసతో యునిఫామ్ వేసి బాలయ్య ఎలాంటి డైలాగ్స్ చెప్తాడని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈరోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది, ఇదే పాజిటివ్ వైబ్ ని మేకర్స్ అక్టోబర్ 21 వరకూ క్యారీ చేయాల్సి ఉంది.