లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని మైంటైన్ చేస్తున్న సమంత, సెప్టెంబర్ 1న ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. విజయ్ దేవరకొండ-సమంత కలిసి నటించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ పై ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. శివ నిర్వాణ లవ్ స్టోరీని బాగా హ్యాండిల్ చేస్తాడు కాబట్టి ఖుషి సినిమా తప్పకుండ హిట్ అవుతుంది అనే నమ్మకం అందరిలోనూ ఉంది. అయితే శివ నిర్వాణ చేసిన టక్ జగదీష్, సమంత చేసిన శాకుంతలం, విజయ్ దేవరకొండ చేసిన లైగర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈ కారణంగా డైరెక్టర్, హీరో, హీరోయిన్ లక ఫ్యూచర్ ఖుషి రిజల్ట్ పైన డిపెండ్ అయ్యి ఉంది. సాంగ్స్ వర్కౌట్ అయ్యాయి, ట్రైలర్ కూడా బాగానే ఉంది కాబట్టి ఖుషి సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తే సినిమా హిట్ అవ్వడం గ్యారెంటీ. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన సమంత, ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ్ దేవరకొండతో డాన్స్ చేసి సినిమాకి ప్రమోషన్స్ చేసింది.
ప్రమోషన్స్ లో తన పార్ట్ కంప్లీట్ అవ్వడంతో సమంత ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ వెళ్లిపోయింది. అక్కడి నుంచి సమంత ఫోటోలు బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత ఎక్కడి వెళ్లినా అభిమానులు వార్మ్ రిసీవింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా సమంత బ్లాక్ సారీలో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఈ ఫొటోల్లో సమంత ట్రెడిషనల్ గా కనిపిస్తూనే ట్రెండీగా ఉంది. 41వ న్యూయార్క్ ఇండియా పరేడ్ డేలో పాల్గొన్న సమంత, అర్పిత మెహతా డిజైన్ చేసిన బ్లాక్ కలర్ ఎంబ్రాయిడరీ సారీలో కనిపించింది. ఈ సారీ కాస్ట్ అక్షరాల లక్షా ముప్పై ఎనిమిది వేలు అంటే సగటున 25 వేలు సంపాదించే వ్యక్తి నాలుగు నెలల జీతం. కొందరు ఒక చీర కాస్ట్ ఇంతనా అని నోరెళ్లబెడుతున్నారు. రేట్ విషయం పక్కన పెడితే సమంత మాత్రం ఈ కాస్ట్యూమ్ లో మోడరన్ లుక్ లో ఉన్న ఇండియన్ గర్ల్ లా ఉంది.